‘నగ్నంగా’ హోటల్ సిబ్బందిని భయపెడతా అన్న స్టార్.. స్వదేశానికి పంపేసిన ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2021-07-20T06:49:25+05:30 IST

తాను దిగిన హోటల్ సిబ్బందిని భయపెట్టడం కోసం నగ్నంగా కనిపిస్తానంటూ పోస్టు పెట్టిన రియాలిటీ స్టార్‌కు ఎదురుదెబ్బ.

‘నగ్నంగా’ హోటల్ సిబ్బందిని భయపెడతా అన్న స్టార్.. స్వదేశానికి పంపేసిన ఆస్ట్రేలియా

కాన్‌బెర్రా: తాను దిగిన హోటల్ సిబ్బందిని భయపెట్టడం కోసం నగ్నంగా కనిపిస్తానంటూ పోస్టు పెట్టిన రియాలిటీ స్టార్‌కు ఎదురుదెబ్బ. ఆస్ట్రేలియా అధికారులు ఆమెను తమ దేశం నుంచి స్వదేశానికి పంపేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన కేటీ హాప్‌కిన్స్ అనే రియాలిటీ స్టార్.. ఆస్ట్రేలియాకువెళ్లింది. ఇక్కడ జరగనున్న ‘బిగ్ బ్రదర్ వీఐపీ’ అనే ప్రోగ్రాంలో ఆమె పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా చేరుకున్న ఆమెను నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంచారు. దీనికోసం ఒక హోటల్‌లో ఉన్న ఆమె.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేసింది. తాను క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. హోటల్ సిబ్బందిని భయపెట్టడం కోసం తాను ఇలా చేస్తానని వీడియోలో చెప్పిన ఆమె.. ‘ఫేస్‌మాస్కు ధరించకుండా నగ్నంగా’ వాళ్లకు కనిపించి బెదరగొడతానని పేర్కొంది. ఈ వీడియో చూసిన ఆస్ట్రేలియా అధికారులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. ఆమెను వెంటనే తమ దేశం నుంచి స్వదేశానికి పంపేశారు.

Updated Date - 2021-07-20T06:49:25+05:30 IST