Realme: రెండు వేరియంట్లలో ఫీచర్ ఫోన్స్..

ABN , First Publish Date - 2021-07-18T02:55:07+05:30 IST

Realme: రెండు వేరియంట్లలో ఫీచర్ ఫోన్స్..

Realme: రెండు వేరియంట్లలో ఫీచర్ ఫోన్స్..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఫీచర్లతో రియల్‌మి ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో రియర్‌మి డిజో, స్టార్ 300, స్టార్ 500 ఫీచర్ ఫోన్లను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. రియల్‌మి డిజో స్టార్ 300 మోడల్ ఫీచర్ ఫోన్ రూ.1,299, డిజో స్టార్ 500 మోడల్ ఫీచర్ ఫోన్ రూ. 1,799 ఉంటుందని సంస్థ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఫీచర్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని సంస్థ ప్రకటించింది. కొనుగోలు చేసిన తేదీ నుంచి రెండు ఫీచర్ ఫోన్లకు 365 రోజులపాటు ఎక్స్ఛేంజ్ వారెంటీ ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

Updated Date - 2021-07-18T02:55:07+05:30 IST