రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్

ABN , First Publish Date - 2020-11-28T23:05:10+05:30 IST

రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్

రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినట్లు కంపెనీ పేర్కొంది. రియల్‌మి ఎక్స్3, రియల్‌మి నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్లపై రూ. 3000 వరకు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.


ఫోన్లను పేటీఎం ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 500 క్యాష్‌బ్యాక్ వస్తుందని తెలిపింది. డిస్కౌంట్ తర్వాత రియల్‌మి ఎక్స్3 ఫోన్ రూ. 21.999కే లభించనుంది. రియల్‌మి నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 13,999కే లభించనుంది.

Updated Date - 2020-11-28T23:05:10+05:30 IST