సంగారెడ్డి జిల్లాలో రియల్టర్‌ దారుణ హత్య

Published: Sat, 29 Jan 2022 20:23:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సంగారెడ్డి జిల్లాలో రియల్టర్‌ దారుణ హత్య

సంగారెడ్డి: జిల్లాలోని రాయికోడ్‌ పీఎస్‌ పరిధిలో రియల్టర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రియల్టర్‌ కడవత్ రాజుని చంపి తల, మొండెంను దుండగులు వేర్వేరుగా పడేశారు. రాయికోడ్ మండలంలోని కుకునూర్ దగ్గర మృతుడి తల, న్యాకల్ మండలం రాఘపూర్ దగ్గర మొండెంను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో సంబంధమున్నదని భావిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 24న బీడీఎల్‌ భానుర్ పీఎస్‌లో రాజు మిస్సింగ్ కేసు నమోదయింది. మృతి చెందిన వ్యక్తిన రామచంద్రపురం మండలం వెల్లిమలతండా వాసిగా గుర్తించారు. ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.