ప్రయాణాల్లో అసలు వాంతులు ఎందుకు అవుతాయి..? వాంతులయ్యేటప్పుడు చెవులను మూయడం వెనుక..

ABN , First Publish Date - 2021-12-18T20:22:04+05:30 IST

ప్రయాణాలు మనిషికి సర్వసాధారణం. కానీ కొంత మందికి ప్రయాణాలు పడవు. కొందరికి బస్సు ప్రయాణం అంటే పడదు

ప్రయాణాల్లో అసలు వాంతులు ఎందుకు అవుతాయి..? వాంతులయ్యేటప్పుడు చెవులను మూయడం వెనుక..

ప్రయాణాలు మనిషికి సర్వసాధారణం. కానీ కొంత మందికి ప్రయాణాలు పడవు. కొందరికి బస్సు ప్రయాణం అంటే పడదు.. ఇంకొందరికి రైలు ప్రయాణం అంటే గిట్టదు.. మరికొందరికి కారు ప్రయాణం అంటే ఇష్టం ఉండదు. ఆయా వాహనాల్లో ప్రయాణం అంటేనే భయపడిపోతుంటారు. దీనింతటికి కారణం. వాంతులు అవుతాయన్న ఆందోళన. అందుకే చాలా మంది ప్రయాణాలంటేనే కంగారుపడుతుంటారు. ట్రావెలింగ్ చేసేటప్పుడే వాంతులు ఎందుకు అవుతుంటాయి. అదేమైనా రోగమా? లేక బలహీనతా? ఇలా ప్రయాణాల్లోనే జరగడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.


బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కొందరికి తల తిరుగుతుంటుంది. వెంటనే వారు కిటికీ నుంచి తల బయటకు పెట్టి వాంతులు చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు బస్సుల్లో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అసలు ప్రయాణాల్లోనే వాంతులు ఎందుకొస్తాయి? అలా వచ్చినప్పుడు వాంతులను ఆపుకోలేమా? దీనికి పరిష్కారం ఏంటి?


ప్రయాణంలో వాంతులు చేసుకునే వాళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. కొందరిలో ప్రయాణం మొదలవ్వగానే ఆ ప్రభావం కనిపిస్తే.. ఇంకొందరికి ఎక్కువ సేపు ప్రయాణం చేసిన తర్వాత కనిపిస్తుంటుంది. మరికొందరికి వాహనాల్లో వచ్చే దుర్వాసనలు వల్ల వాంతులు చేసుకుంటారు. ఈ ప్రభావం ఎక్కువగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మగవాళ్లలో మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. జన్యుపరంగా కూడా ఇలా జరుగుతుంటుందని డాక్టర్లు అంటుంటారు. ప్రయాణాల్లో తలతిరగడం, వాంతులు కావడానికి ప్రధాన కారణం చెవిలో ఉండే లాబ్రింథైస్ అనే భాగం శుభ్రంగా ఉండకపోవడమే కారణమని నిపుణులు చెప్తున్నారు. రోజూ స్నానం చేయకపోవడం, సబ్సుతో ముఖం కడుకున్నప్పుడు చెవుల్లో ఉండే నురగను క్లీన్ చేయడకపోవడం, చెవిలో నూనె వేయడం, ఏదొక వస్తువుతో పదే పదే తిప్పడం వల్ల చెవిలో ఉండే లాబ్రింథైస్ దెబ్బతింటుంది. దీని వల్ల వాంతులు అవుతుంటాయి.  ఎప్పుడైతే  లాబ్రింథైస్ శుభ్రంగా ఉండదో మెదడకు అందాల్సిన సంకేతాలు సరిగా అందకపోవడం వల్ల తిలతిరగడం, వికారంగా ఉండడంతో ఒక్కసారిగా వాంతులు అవుతుంటాయి. 


ఇక వాంతులు చేసుకునేవారి చెవులు చేతులతో మూసేస్తారు. అలా ఎందుకు చేస్తారు? దీని వల్ల మనకేమైనా ఉపశమనం కల్గుతుందా? అసలు ప్రయాణంలో వాంతులు అవ్వకుండా పరిష్కారం ఉందా? అలాగే చెవులు మూయడం ఎంత వరకు కరెక్టో తెలుసుకుందాం.


వాంతుల సమయంలో చెవులు మూయడం వల్ల బయట నుంచి చెవుల్లోకి గాలి వెళ్లనీయకుండా చేసి చెవిలోపలి భాగంపై ఒత్తిడి పెరగకుండా చేస్తుంది. ఇక ప్రయాణాల్లో వాంతులు అవుతాయన్న భయంతో నియ్మకాయ పట్టుకుని వెళ్తుంటారు. నిమ్మకాయలో ఎసిడిక్ యాసిడ్స్ ఉండడం వల్ల ఉపశమనం కల్గిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వాంతులు ప్రాణాలు తీసే వ్యాధి కాదు. కానీ మాటిమాటికీ ప్రయాణాల్లో వాంతులు అవుతుంటే ఇబ్బంది కరమైన పరిస్థితి. అయితే దీనికో మార్గం ఉంది. ప్రయాణంలో వాంతులు అవుతాయన్న ఫీలింగ్ మనసులో పెట్టుకోకూడదు. ఆ భయాన్ని మొదట తీసివేయాలి. ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో ప్రకృతి అందాలు మన కంటికి దర్శనమిస్తుంటాయి. కనిపించే ప్రతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. అంతేకాకుండా కొత్త కొత్త మనుషులు కనిపిస్తూ ఉంటారు. వారి ముఖాలు చూస్తూ, వారి ప్రవర్తనను కనిపెడుతూ ఉండడం వల్ల కూడా ఈ సమస్య నుంచి అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-18T20:22:04+05:30 IST