ఇలియానాకు చెక్‌ పెట్టిన తమిళ నిర్మాత?

Jun 10 2021 @ 22:34PM

పదేళ్ళ క్రితం తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన హీరోయిన్‌ ఇలియానాకు ఒక తమిళ నిర్మాత చెక్‌ పెట్టడం వల్ల ఆమెకు కోలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఇలియానా టాలీవుడ్‌లోని ప్రతి ఒక్క హీరో సరసన నటించింది. ఒక దశలో బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ ఆమెను వెతుక్కుంటూ వచ్చినప్పటికీ హిందీ చిత్రసీమవైపు కన్నెత్తి కూడా చూడలేదు. తెలుగు చిత్రాల్లో నటిస్తూ నంబర్‌ వన్‌ హీరోయిన్‌గా కొనసాగింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆమెను అక్కడ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2018లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ అనే చిత్రం ద్వారా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. 


కానీ, ఈ చిత్రం ఆమెను గట్టెక్కించలేకపోయింది. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోయిన్‌గా కొనసాగిన ఇలియానాకు ఇపుడు ఎక్కడ చూసినా చుక్కెదురవుతోంది. దీనికి కారణంపై ఆరా తీస్తే ఓ షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సినీ నిర్మాత వద్ద ఆమె కొంత డబ్బు తీసుకుని ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదన్నది సమాచారం. దీంతో ఆ నిర్మాత ఆమెపై కక్షగట్టి తమిళంలోకి అడుగు పెట్టకుండా చేయడమే కాకుండా, తెలుగు చిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారట. ఫలితంగా అక్కడి నిర్మాతలు ఆమెకు రెడ్‌కార్డ్‌ చూపిస్తున్నారన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.