విజయ్ ‘తుపాన్’ బీభత్సానికి కారణమిదే!

ABN , First Publish Date - 2022-01-31T20:18:26+05:30 IST

సినిమా ఇండస్ట్రీకి సరికొత్త యాటిట్యూడ్‌ని పరిచయం చేసిన హీరో విజయ్ దేవరకొండ. త్వరలో పాన్ ఇండియాకి తన యాటిట్యూడ్‌ని పరిచయం చేయబోతున్న ఈ రౌడీ..

విజయ్ ‘తుపాన్’ బీభత్సానికి కారణమిదే!

సినిమా ఇండస్ట్రీకి సరికొత్త యాటిట్యూడ్‌ని పరిచయం చేసిన హీరో విజయ్ దేవరకొండ. త్వరలో పాన్ ఇండియాకి తన యాటిట్యూడ్‌ని పరిచయం చేయబోతున్న ఈ రౌడీ.. సడెన్‌గా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ‘తుపాన్’ (TOOFAN) అంటూ యాడ్ చేయడంతో.. ఏదో జరగబోతోంది అనేలా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో విజయ్ ‘తుపాన్’ ట్యాగ్ ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. ఈ బీభత్సానికి కారణం ఏమిటో తెలుసా..?


సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రముఖ బ్రాండ్ థమ్సప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. అందుకే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ‘తుపాన్’ అంటూ యాడ్ చేశారు. ‘సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుపాన్’ (Soft Drink Kaadu, idi Toofan) అంటూ థమ్సప్ బాటిల్ పట్టుకుని ఉన్న విజయ్ పోస్టర్‌ని తాజాగా రివీల్ చేశారు. దీనికి సంబంధించిన యాడ్‌ షూట్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ యాడ్ మంగళవారం నుండి టెలివిజన్, ఇతరత్రా మీడియాలలో టెలికాస్ట్ కానుందని అధికారికంగా తెలియజేశారు. 


ఈ యాడ్‌లో విజయ్ హాలీవుడ్ స్థాయిలో స్టంట్స్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ రౌడీ.. ఈ యాడ్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందడం ఖాయం అనేలా సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

Updated Date - 2022-01-31T20:18:26+05:30 IST