హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలేంటంటే..?

ABN , First Publish Date - 2022-02-15T18:41:01+05:30 IST

ఆహారం ధమనులను పూడుకుపోయేలా చేయగలదు. పూడికలు తొలగి, విప్పారేలా చేయగలదు. కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహార ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలి. ధమనుల్లో అవరోధాలను తొలగించడానికి తోడ్పడే ఆహారం ఇదే!

హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలేంటంటే..?

ఆంధ్రజ్యోతి(15-02-2022)

ఆహారం ధమనులను పూడుకుపోయేలా చేయగలదు. పూడికలు తొలగి, విప్పారేలా చేయగలదు. కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహార ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలి. ధమనుల్లో అవరోధాలను తొలగించడానికి తోడ్పడే ఆహారం ఇదే!


కొవ్వులు, కొలెస్ట్రాల్‌, క్యాల్షియం, ఫైబ్రిన్‌, సెల్యులర్‌ వేస్ట్‌... ఇవన్నీ ప్లేక్స్‌ రూపంలో ధమనుల్లో అవరోధాలుగా మారి, గుండెకు రక్తం, ఆక్సిజన్‌ల సరఫరాను తగ్గిస్తాయి. ధమనులు ఈ అవరోధాలతో మూసుకుపోయినప్పుడు కరొనరీ ఆర్టెరీ డిసీజ్‌, హార్ట్‌ ఎటాక్‌, స్ర్టోక్‌ లేదా కరోటిడ్‌ ఆర్టెరీ డిసీజ్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి రాకుండా ఉండాలంటే ధమనుల్లో అవరోధాలు ఏర్పడకుండా చేసే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి.  


ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌: కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌ను ఎంచుకోవాలి. దీన్లో మోనో, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. 65, అంతకంటే ఎక్కువ వయస్కులు ఈ నూనెను క్రమం తప్పక వాడడం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశాలు 41ు తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది. కనోలా నూనె, వెజిటబుల్‌ ఆయిల్‌ లేదా వెన్నలను వాడే వాళ్లు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. 


దానిమ్మ: వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రత్యేకంగా దీన్లో ఉండే విటమిన్‌ సి, ఇతర పాలీఫినాల్స్‌ నైట్రిక్‌ యాసిడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ యాసిడ్‌ ధమనులను విప్పార్చి, రక్త సరఫరా మెరుగ్గా జరిగేలా తోడ్పడుతుంది. దానిమ్మ ధమనుల్లో ప్లేక్‌ పెరగకుండా అడ్డుకుంటుంది.


అవకాడొ: వీటిలో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఈ పండ్లు ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గిస్తాయి. అధిక ఎల్‌డిఎల్‌ మోతాదులు ధమనుల్లో ప్లేక్‌ ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి ప్లేక్‌ను దూరంగా పెట్టాలంటే, రోజుకొక అవకాడొ తింటూ ఉండాలి. అవకాడొలోని పొటాషియం రక్తపోటును సహజసిద్ధంగా తగ్గిస్తుంది.

 

నట్స్‌: మధ్యాహ్న చిరుతిండిగా బిస్కెట్లు, చిప్స్‌కు బదులుగా నట్స్‌ తినాలి. బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌, పిస్తాలన్నీ కలిపి రోజుకొక గుప్పెడు నట్స్‌ తింటూ ఉండాలి. వీటిలో విటమిన్‌ ఇ, పీచు, మోనోశాచురేటెడ్‌ కొవ్వులు, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. మెనోశాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బులను తగ్గిస్తాయి. 


వెల్లుల్లి: వెల్లుల్లి రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వెల్లుల్లి ధమనుల గోడలు గట్టిపడకుండా తోడ్పడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా రోజూ ఆహారంలో కనీసం నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉండేలా చూసుకోవాలి. 


పసుపు: పసుపు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఆర్టీరియోస్ల్కెరోసిస్‌కు ప్రధాన కారణం ధమనుల్లో వాపు. పసుపులోని కుర్‌క్యుమిన్‌ ధమనుల్లో కొవ్వు నిల్వలను 26ు మేరకు తగ్గిస్తుంది.


Updated Date - 2022-02-15T18:41:01+05:30 IST