తిరుగుబావుటా

ABN , First Publish Date - 2021-09-17T04:40:59+05:30 IST

నిజాం నవాబు కర్కశ పాలనకు విసిగి, వేసారిన పాలమూరు బిడ్డలు తిరుగుబాటు చేశారు..

తిరుగుబావుటా
అప్పంపల్లిలోని అమరుల స్తూపం

- రజాకార్ల తుపాకులకు గుండె చూపిన అయిజ, అప్పంపల్లి గ్రామస్థులు

- లెవీ ఉద్యమం, హైదరాబాద్‌ స్టేట్‌ను ఇండియాలో కలపాలని నిజాంపై తిరుగుబాటు

- అయిజలో రజాకార్ల కాల్పుల్లో ఐదుగురి దుర్మరణం

- ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్‌పై బాంబు వేసిన నడిగడ్డ తెలంగాణ పోరాట యోధులు

- అప్పంపల్లిలో 11 మందిని కాల్చి చంపిన రజాకార్లు

- నేటికీ ఘటన జరిగి 74 ఏళ్లు 

- ఇప్పటికీ అమరుల కుటుంబాలకు అందని స్వరాష్ట్ర ఫలాలు


అయిజ/చిన్నచింతకుంట, సెప్టెంబరు 16 : నిజాం నవాబు కర్కశ పాలనకు విసిగి, వేసారిన పాలమూరు బిడ్డలు  తిరుగుబాటు చేశారు.. రజాకార్ల ఆకృత్యాలు, పన్నుల పేరుతో దోపిడీని, ఆడ బిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలను సహించలేక పిడికిలి బిగించారు.. అరబ్‌ సైన్యాలు, రజాకార్ల తుపాకులకు గుండెలు చూపి, ఎదురు నిలిచారు.. చివరకు ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడ లేదు.. ఉద్యమాలతో ప్రజలను చైతన్యం చేసి, నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగుర వేశారు.. లెవీ, హైదరాబాద్‌ స్టేట్‌ను భారత్‌లో కలపాలనే డిమాండ్‌తో సాగిన ఉద్యమంలో అయిజ, అప్పంపల్లిలలో 16  మంది నిజాం సైన్యాల తూటాలకు అమరులయ్యారు..

1947-48లో తీవ్ర కరువు కాటకాలతో అయిజలో పంటలు ఎండి పోయాయి. గ్రాసం దొరక్క పశువులు, తిండి గింజలు లేక మనుషులు అల్లాడుతున్న సమయం అది. ఈ సమయంలోనే నైజాం స ర్కార్‌ లెవీ (ధాన్యం) పన్ను ప్రవేశ పెట్టింది. అప్పటికే జుట్టు ప న్నుతో ఇక్కడి జనం విసిగిపోయారు. పన్ను చెల్లించాల్సిందేనంటూ నిజాం ప్రభువు ప్రజలపై ఒత్తిడి చేశారు. దౌర్జన్యాలు, మహిళలపై అకృత్యాలు, పన్ను కింద పశువులను జమ చేసుకోవడం చే శారు. అప్పటి వరకు జీవచ్చవంలా బతుకుతున్న ప్రజలు పిడికిలి బిగించారు. లెవీ పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామస్థులు నైజాం సర్కార్‌పై పోరాడేందుకు సిద్ధపడ్డారు. అయితే, నిఘా సమాచారంతో అప్రమత్తమైన నవాబు ప్రజలను అణచివేసేందుకు వంద మంది పోలీసులకు, 300 మంది అరబ్బు దళాలకు ఆయుధాలు చేతికిచ్చి అయిజకు పంపారు. ప్రజలు రజాకార్లుకు భయపడక తిరగబడ్డారు. రాళ్లు, కర్రలు, కారంపొడితో ఎదురు తిరిగారు. రజకార్లు ప న్నులు కట్టి తీరాల్సిందే అంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. లాఠీలు, తుపాకులతో దౌర్జన్యానికి దిగారు. ప్రజలు ఎదురు తి రగటంతో వారు జరిపిన కాల్పుల్లో నాయకి చిన్నతిమ్మప్ప, కల్లె బీసిగాడు, కొండాపురం నర్సప్ప, పాగుంట వెంకటయ్య, బలిజ నా గయ్య చనిపోయారు. అంతటితో ఆగక రజాకార్లు దాదాపు 300 మంది తిరుగుబాటుదారుల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి 30 కి లోమీటర్ల దూరంలో ఉన్న గద్వాలకు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన అనంతరం నడిగడ్డ తెలంగాణ పోరాట యోధులు సంఘటితమై అయిజ పోలీస్టేషన్‌పై బాంబులు వేశారు. తదనంతరం కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు ప్రతీ పల్లెల్లో చేపట్టిన లెవీ నిరాకరణ ఉద్యమం విజయవంతమైంది. రజాకార్ల కాల్పుల్లో అమరులైన వారి జ్ఞాపకార్థం సంఘటనా స్థలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, శిలాఫలకం ఏర్పాటు చేశారు.


కిటికీ నుంచి కాల్పులు

అది అక్టోబరు ఏడు, 1947. ఆత్మకూర్‌, అమరచింత సంస్థాన ప రిధిలోని అప్పంపల్లి గ్రామంలో హైదరాబాద్‌ స్టేట్‌ను భారత్‌లో వి లీనం చేయాలని బెల్లం నాగన్న నేతృత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ని జాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమంలో నెల్లికొండి, వడ్డెమాన్‌, దాసర్‌పల్లి, రాంపూర్‌, లంకాల, అమరచింత గ్రామాలకు చెందిన దాదాపు రెండు వేల మంది ఉద్యమకారులు పా ల్గొన్నారు. అయితే, ఈ ఉద్యమాన్ని అణచివేయడంలో నిజాం సైనికు లు విఫలమయ్యారు. దీంతో నిజాం నవాబు మహబూబ్‌నగర్‌లో ఉ న్న రిజర్వ్‌ దళాలను అప్పంపల్లికి పంపించాడు. వారు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్నతో పాటు మరికొందరుని అరె స్టు చేసే ప్రయత్నం చేశారు. ప్రజలు తిరుగుబాటు చేయడంతో, గ్రా మ నడిబొడ్డులో రావి చెట్టు సమీపంలో ఉన్న విడిది భవనంలోకి వె ళ్లిపోయారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విడిది భవనం నుంచి రిజర్వ్‌ దళాలు బయటకు వచ్చి, ప్రజలపై బాష్పవాయువును ప్రయోగించాయి. అనంతరం దళాలు మళ్లీ భవనంలోకి వెళ్లి కిటికీ నుంచి కాల్పులు జరపడంతో 11 మంది చనిపోయారు. మృ తుల్లో చాకలి కురుమయ్య, కటిక నణెమ్మ, హరిజన్‌ కిష్టన్న, పో తురాజు ఈశ్వరయ్య, కుర్వ సాయన్న, తంగెడి లక్ష్మారెడ్డి, తంగెడి రాంరెడ్డి, తంగెడి బాల్‌రెడ్డి, వడ్డెమాన్‌ నర్సన్న, తిమ్మన్న, గొల్ల గ జ్జలన్న ఉన్నారు. అదే సమయంలో నెల్లికొండి కుక్కల కిష్టన్న తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగుర వేశాడు. ఇది గమనించిన తా లూకా గిర్దావర్‌ గౌస్‌ఖాన్‌, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేర్‌ బాబర్‌ అలీ కిష్టన్నను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా, గ్రామస్థులు మళ్లీ అడ్డుకు న్నాడు. దీంతో కిష్టన్నను వదిలి వెళ్లిపోయారు. ఈ ఉద్యమంలో ప్రధాన భూమిక వహించిన నాగన్నను అరెస్టు చేసి జైలుకు తరలించారు. హైదరాబాద్‌ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేసిన అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. 1982లో కన్నుమూశారు.

ఈ ఘటన జరిగి నేటికీ 74 ఏళ్లు అయ్యింది. కానీ, ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఏ ప్రభుత్వమూ నేటి వరకు ఆదు కోలేదు. స్వరాష్ట్రం సిద్ధించినా, తగిన న్యాయం జరగలేదు. అయితే, వీరి త్యాగాలకు గుర్తుగా గ్రామంలోని రావిచెట్టు వద్ద బీజేపీ ఆధ్వ ర్యంలో 2004లో అమరుల స్థూపం ఏర్పాటు చేసారు. ప్రతీ ఏటా సెప్టెంబరు 17న అమరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.



Updated Date - 2021-09-17T04:40:59+05:30 IST