వైసీపీకి రెబల్స్‌ బెడద

ABN , First Publish Date - 2021-03-09T04:58:05+05:30 IST

కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీకి రెబల్స్‌ దడ పుట్టిస్తున్నారు. టికెట్‌ ఆశించి భంగపడ్డ కొందరు రెబల్స్‌గా బరిలో దిగడంతో కార్పొరేషన్‌ ఎన్నికలు మంచి కాక పుట్టిస్తున్నాయి. 50 డివిజన్లకు గాను 24 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో 26 చోట్ల పోటీ చేస్తోంది.

వైసీపీకి రెబల్స్‌ బెడద

కొందరి ఓటమి కోసం లోపాయికారీ యత్నం 

కాక పెంచుతున్న కార్పొరేషన్‌ ఎన్నికలు

(కడప - ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీకి రెబల్స్‌ దడ పుట్టిస్తున్నారు. టికెట్‌ ఆశించి భంగపడ్డ కొందరు రెబల్స్‌గా బరిలో దిగడంతో కార్పొరేషన్‌ ఎన్నికలు మంచి కాక పుట్టిస్తున్నాయి. 50 డివిజన్లకు గాను 24 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో 26 చోట్ల పోటీ చేస్తోంది. టికెట్‌ ఆశించిన నాలుగు చోట్ల రెబల్స్‌ బరిలో ఉండడంతో వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే కొందరు బరిలో ఉన్న అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉండడం ఆ పార్టీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 1, 14, 40, 44 డివిజన్లలో వైసీపీ రెబల్స్‌గా పోటీ చేసిన అభ్యర్థులను సస్పెండ్‌ చేస్తున్నట్లు వైసీపీ నాయకులు ఇటీవల ప్రకటించారు. 


అపనమ్మకం

వైసీపీ తరపున పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులు అప నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. రకరకాల సిఫారసులతో కొందరు టికెట్లను తీసుకున్నారు. అది దక్కని వారు అభ్యర్థులను ఓడించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆ విషయంగా ఓ నేత స్పందించిన తీరుపై కొందరిలో అనుమానాలకు బీజం తలెత్తినట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థుల వెంటే ప్రచారం చేస్తున్న ప్పటికీ లోలోపల ప్రత్యర్థికి సహకరిస్తున్నట్లు కొందరు అభ్యర్థులు గుర్తించినట్లు తెలిసింది. 


మరో డివిజన్‌ వైసీపీ ఖాతాలో 

కార్పొరేషన్‌ ఎన్నికల్లో మరో డివిజన్‌ వైసీపీ ఏకగ్రీవ ఖాతాలో పడింది. 7వ డివిజన్‌ వైసీపీ అభ్యర్థిగా ఎన్‌.మల్లీశ్వరి, టీడీపీ అభ్యర్థిగా హైమావతి నామినేషను దాఖలు చేయగా, హైమావతి నామినేషన్‌ను పరిశీ లన సమయంలో ఆర్‌ఓ తిరస్కరించారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో నామినేషను వేయలేని వారికి సరైన ఆధారాలు చూపిస్తే మరోసారి నామినేషన్‌కు అవకాశం కల్పిస్తు న్నట్లు ఇటీవల ఎన్నికల కమిషన్‌ ప్రకటిం చింది. దీంతో హైమావతి నామినేషన్‌ దాఖ లుపై మల్లీశ్వరి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చింది. దీంతో మల్లీశ్వరి ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. 

Updated Date - 2021-03-09T04:58:05+05:30 IST