రెబల్స్‌ తప్పుకోవాల్సిందే

ABN , First Publish Date - 2021-03-02T07:07:37+05:30 IST

జిల్లాలో ఎక్క డా రెబల్స్‌ ఉండకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుకోవా ల్సిందే. లేకపోతే పార్టీ పరంగా చర్యలు తప్పవని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మం త్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

రెబల్స్‌ తప్పుకోవాల్సిందే

- లేకుంటే చర్యలు తప్పవు

- స్పష్టం చేసిన సజ్జల, బొత్స

- మున్సిపాలిటీల వారీగా ఎమ్మెల్యేలతో చర్చ

- అంతర్గత చర్చల్లో కొందరికి క్లాస్‌

అనంతపురం కార్పొరేషన్‌,మార్చి1 : జిల్లాలో ఎక్క డా రెబల్స్‌ ఉండకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుకోవా ల్సిందే. లేకపోతే పార్టీ పరంగా చర్యలు తప్పవని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మం త్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎ న్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కేటీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో వైసీపీ ఎమ్మెల్యేలతో వారు సమావేశమ య్యారు. తొలుత ఎమ్మెల్యేలు, ఎన్నికల పరిశీలకులతో స మావేశమయ్యారు. ఈసందర్భంగా వారు  అభ్యర్థుల విష యంపై మాట్లాడారు.  ఎక్కడైనా పార్టీలో రెబల్స్‌ ఉంటే తప్పుకోవాలన్నారు. లేకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేదని,  మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉందని, మునపటి కంటే ఈ సారి మరింత ఎక్కువ శాతం విజ యం దక్కాలన్నారు. ఎన్నికల్లో అందరు అభ్యర్థులు గెలవాలని,  స్పష్టం చేశారు. 

కొందరికి క్లాస్‌...

అనంతరం ప్రత్యేకంగా ఓ గదిలో సమావేశమయ్యారు. అనంతపురం పార్లమెంటు పరిధిలోని అనంతపురం కార్పొరేషన్‌, గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం మున్సిపాలిటీలకు సంబంధించి ఎమ్మెల్యేలతో వేర్వేరుగా ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం పుట్టపర్తి లో హిందూపురం పార్లమెంటు పరిధిలోని హిందూపురం, కదిరి, ధర్మవరం మున్సిపాలిటీలు, మడకశిర, పుట్టపర్తి నగర పంచాయతీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మా ట్లాడారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో రెబల్స్‌ గురించి ఆరా తీశారు. మేయర్‌, మున్సిపల్‌ చైౖర్మన్‌ అభ్య ర్థులు ఎట్టిపరిస్థితుల్లో గెలవాల్సి ఉంటుందని, ఆ బాధ్యత కూడా మీదేనని స్పష్టం చేసినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులకు పార్టీ తరఫున బీ-ఫాం దక్కకుం డా నేతలే అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులపైనా కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకినట్లు సమాచారం.  తీవ్ర పోటీ ఉన్న అనంతపురం కార్పొరేషన్‌, మరికొన్ని మున్సిపా లిటీలలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ల పదవికి సంబంధిం చి చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశం అ నంతరం బొత్ససత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వాహనం వద్దకు వెళ్తున్న సమయంలో వైసీపీ నేతలు వారితో కలవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. 

Updated Date - 2021-03-02T07:07:37+05:30 IST