Love letter వచ్చింది: IT నోటీసుపై Sharad Pawar

ABN , First Publish Date - 2022-07-01T19:07:37+05:30 IST

ఈడీ లాంటి కేంద్ర ఏజెన్సీ సంస్థలు ఈరోజుల్లో చాలా ఉపయోగపడుతున్నాయి. మంచి ఫలితాలను సైతం ఇస్తున్నాయి. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందాయని పలువురు శాసన సభ్యులు చెబుతున్నారు. ఈ కొత్త పద్దతి ఈ మధ్యే మొదలైంది..

Love letter వచ్చింది: IT నోటీసుపై Sharad Pawar

ముంబై: ఆదాయపు పన్ను శాఖ(Income Tax department) నుంచి నోటీసు రావడంపై ‘లవ్ లెటర్(love letter)’ వచ్చిందంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్(NCP chief Sharad Pawar) చమత్కరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసిన మరునాడే పవార్‌కు నోటీసు రావడం గమనార్హం. కాగా 2004, 2009, 2014, 2020 ఎన్నికల్లో పవార్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఉన్న సమాచారాన్ని తాజాగా పరిశీలిస్తున్నారట. అందుకే తనకు నోటీసు అందిందని శరద్ పవార్ తెలిపారు. విభిన్న భావజాలం ఉన్న వ్యక్తులపై ఇలా ప్రభుత్వ సంస్థలను ప్రయోగించడం సాధారణమైందని విమర్శించారు. ఈ విషయమై స్పందిస్తూ ఆయన గురువారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు.


‘‘ఈడీ లాంటి కేంద్ర ఏజెన్సీ సంస్థలు ఈరోజుల్లో చాలా ఉపయోగపడుతున్నాయి. మంచి ఫలితాలను సైతం ఇస్తున్నాయి. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందాయని పలువురు శాసన సభ్యులు చెబుతున్నారు. ఈ కొత్త పద్దతి ఈ మధ్యే మొదలైంది. ఐదు సంవత్సరాల క్రితం ఈడీ పేరు మాకు కూడా తెలియదు. కానీ ఈరోజు పళ్లెటూరిలో సైతం నీ వెనకాల ఈడీ ఉందంటూ జోకులు వేసుకుంటున్నారు. విభిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తుల కోసం ఈ వ్యవస్థలు ఉపయోగపడుతున్నాయి. నాక్కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇలాంటి ఒక ప్రేమ లేఖ వచ్చింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి అఫిడవిట్‌‌లో ఉన్న సమాచారాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నారట.


2004, 2009లలో లోక్‌సభకు పోటీ చేశారు. ఆ తర్వాత 2014, 2020లో రాజ్యసభకు పోటీ చేశారు. ఈ ఎన్నికల అఫిడవిట్‌లకు సంబంధించిన నోటీసులు కూడా వచ్చాయి. అదృష్టవషాత్తూ అప్పటి సమాచారం అంతా నా దగ్గర ఉంది. కాబాట్టి సమాచారం ఇవ్వడానికి నేను చింతించను. చాలా సంవత్సరాల సమాచారాన్ని సేకరించడం, నిర్దిష్ట వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరించడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది’’ అని పవార్ ట్వీట్లు చేశారు.

Updated Date - 2022-07-01T19:07:37+05:30 IST