14న భగవద్గీత అఖండ పారాయణం

Dec 8 2021 @ 01:55AM
టీటీడీ అధికారులతో సమావేశమైన అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమల, డిసెంబరు7(ఆంధ్రజ్యోతి): తిరుమల నాదనీరాజనం వేదికపై గీతాజయంతిని పురస్కరించుకుని ఈనెల 14వ తేదీన సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన గీతాజయంతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆ రోజు ఉదయం 7 నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకు భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలను నిరంతరాయంగా పారాయణం చేయనున్నట్లు చెప్పారు. ఈ శ్లోకాలను కాశీపతి పారాయణం చేయగా, కుప్పా విశ్వనాథశాస్త్రి వ్యాఖ్యానం చేస్తారన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నందున అవసరమైన ఇంజినీరింగ్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎస్వీబీసీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గీతా పారాయణం సింహభాగంలో ఉన్నట్లు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు భగవద్గీత పారాయణం వీక్షించి, మళ్లీ, మళ్లీ ప్రసారం చేయమని కోరుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, సీఈవో సురే్‌షకుమార్‌, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీఈవో రమే్‌షబాబు, హెల్త్‌ఆఫీసర్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.