టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో మహిళా వర్సిటీకి గుర్తింపు

ABN , First Publish Date - 2021-04-23T08:07:04+05:30 IST

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిన ర్యాంకింగ్స్‌-2021లో పద్మావతి మహిళా యూనివర్సిటీకి ఉన్నత గుర్తింపు లభించింది.

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో మహిళా వర్సిటీకి గుర్తింపు

దేశంలో 25వ స్థానం


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్‌ 22: ప్రపంచంలోని ఉన్నత విద్యా సంస్థలకు టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిన ర్యాంకింగ్స్‌-2021లో తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీకి ఉన్నత గుర్తింపు లభించింది. 601-800 మధ్య ర్యాంకుతో దేశంలోనే 25వ స్థానంలో నిలిచింది. వందకి 49.1 స్కోర్‌ సాధించింది. అలాగే ఈ ర్యాంకు పొందిన మొదటి మహిళా వర్సిటీగా ప్రత్యేకతను సంతరించుకుంది. బోధన, పరిశోధన, విస్తరణ, సదుపాయాలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాల్లో వర్సిటీ  పాటిస్తున్న ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంక్‌ను ప్రకటించారు. ర్యాంకు రావడంపై వీసీ జమున, రిజిస్ట్రార్‌ మమత హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వర్సిటీ మరింత ఉన్నత గుర్తింపును పొందేందుకు విద్యార్థులు, ఉద్యోగులు కృషి చేయాలని ఆకాంక్షించారు.


లా విభాగంలో 26, 30 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు

పద్మావతి మహిళా వర్సిటీ లా విభాగంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 26, 30 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. మూడేళ్ల కోర్సులో 13, ఐదేళ్ల కోర్సులో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 26న మొదటి దశ, 30న చివరి దశ అడ్మిషన్లు చేపడతారు. లాసెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థినులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. ఈ మేరకు వర్సిటీ లా విభాగాధిపతి సీతాకుమారి తెలిపారు. 

Updated Date - 2021-04-23T08:07:04+05:30 IST