అంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు

ABN , First Publish Date - 2022-06-29T07:08:02+05:30 IST

అంకిత భావంతో పనిచేస్తే సిబ్బందికి గుర్తింపు లభిస్తుందని డీఆర్‌డీఏ పీడీ వినోద్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో సెర్ప్‌ సిబ్బంది అభినందన సభ స్థానిక వీకేబీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు.

అంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ వినోద్‌

డీఆర్‌డీఏ పీడీ వినోద్‌ 

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 28:అంకిత భావంతో పనిచేస్తే సిబ్బందికి గుర్తింపు లభిస్తుందని డీఆర్‌డీఏ పీడీ వినోద్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో సెర్ప్‌ సిబ్బంది అభినందన సభ స్థానిక వీకేబీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ  గత ఏడాది బ్యాంక్‌ లింకేజీ, రికవరీలో రాష్ట్రంలనే ప్రఽథమ స్థానంలో నిలిచి గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చే అవార్డు తీసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ సంవత్సరం కూడా సిబ్బంది ఇలాగే క్రమశిక్షణతో కృషి చేసి ముందంజలో నిలపాలన్నారు. జిల్లా ఏపీడీ సుధీర్‌ మాట్లాడుతూ జిల్లా సెర్ప్‌ సిబ్బంది, మండల సమాఖ్య, గ్రామ సమాఖ్యల సహకారంతో ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. మహిళా సంఘాల సభ్యుల ఉత్ప త్తులకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మకాలకు సెర్ప్‌ ద్వారా ఒప్పందం జరిగిందన్నారు. అందుకోసం నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన ఏపీఎం, సీసీ, వీవోఏలకు మండల సమాఖ్యలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాప్తికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రమ్య, కార్యదర్శి శ్రీలత, కోశాధికారి సౌందర్య, ఎంజీఎన్‌ఎఫ్‌ ఫెలో నవ్య, డీపీఎంలు వెంకటేష్‌, మల్లేష్‌, మౌనిక్‌ రెడ్డి, వనజ అన్ని మండలాల ఏపీఎంలు. సీఈసీలు, శ్రీనిధి మేనేజర్‌లు, ఈజీఎస్‌ సిబ్బంది, డీఆర్‌డీఏ సిబ్బంది తదితరులున్నారు.

Updated Date - 2022-06-29T07:08:02+05:30 IST