Kuwait: ప్రవాసుల కార్ల విషయమై కువైత్ సంచలన నిర్ణయం..!

ABN , First Publish Date - 2022-08-05T13:52:03+05:30 IST

ఇప్పటికే ప్రవాసులకు పలు కఠిన నిబంధనలతో పొమ్మనలేక పొగపెడుతున్న గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

Kuwait: ప్రవాసుల కార్ల విషయమై కువైత్ సంచలన నిర్ణయం..!

కువైత్ సిటీ: ఇప్పటికే ప్రవాసులకు పలు కఠిన నిబంధనలతో పొమ్మనలేక పొగపెడుతున్న గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రవాసులకు సంబంధించిన పదేళ్లు దాటిన కార్లను (Cars) బ్యాన్ చేయాలంటూ ఆ దేశ టెక్నికల్ కమిటీ తాజాగా సిఫార్సు చేసింది. ట్రాఫిక్ (Traffic) సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటైన ఈ టెక్నికల్ కమిటీ ఈ మేరకు సూచించినట్లు సమాచారం. 10 నుంచి 20 ఏళ్ల కేటగిరీకి చెందిన వలసదారుల (Expats) కార్లు ఇప్పటికే వందలాదిగా దేశంలో ఉన్నాయని కమిటీ నిర్ధారించింది. ఈ వాహనాల వల్ల భారీగా వాయువు కాలుష్యం (Air Pollution), రోడ్డు ప్రమాదాలు పెరిగి ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్నాయని కమిటీ అభిప్రాయపడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. 


అలాగే ఇలాంటి వాహనాల ఇందన వినియోగం కూడా భారీగా ఉంటున్నట్లు కమిటీ తెలిపింది. ఇక టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారా ఇలాంటి కేటగిరీకి చెందిన కార్లు ఎక్కువగా మధ్య, దిగువ స్థాయి ప్రవాస కార్మికులకు చెందినవేనని తేలింది. కువైత్‌లో పాత వాహనాల వల్ల ఏర్పడే కాలుష్య సమస్య పరిష్కారానికి పిలుపునిచ్చిన ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ గతంలో చేసిన డిమాండ్‌లకు అనుగుణంగా ఈ సిఫార్సు ఉన్నట్లు కువైత్ మీడియా వెల్లడించింది.  

Updated Date - 2022-08-05T13:52:03+05:30 IST