రికార్డ్... ‘ఐటీసీ’లో... 1.99 మిలియన్‌ షేర్ల ట్రేడ్

ABN , First Publish Date - 2021-07-26T22:37:37+05:30 IST

వలం ఒక్కటంటే ఒక్కటే లావాదూవీలో... ఐటీసీలో ఈ రోజు... పెద్దమొత్తంలో షేర్లు చేతులు మారాయి.

రికార్డ్... ‘ఐటీసీ’లో... 1.99 మిలియన్‌ షేర్ల ట్రేడ్

న్యూఢిల్లీ : కేవలం ఒక్కటంటే ఒక్కటే లావాదూవీలో... ఐటీసీలో  ఈ రోజు... పెద్దమొత్తంలో షేర్లు చేతులు మారాయి. మొత్తం ఈక్విటీలో 1.6శాతానికి సమానమైన 1.99 మిలియన్‌ షేర్లు లార్జ్‌ డీల్‌ రూపంలో ట్రేడయ్యాయి. అయితే క్రయ, విక్రయదారులకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 


మొదటి త్రైమాసికం ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?

జూన్‌ 30 తో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఐటీసీ ప్రకటించింది. కంపెనీ రెవిన్యూ త్రైమాసికం ప్రాతిపదికన 8శాతం క్షీణతతో రూ. 14,156.96 కోట్ల నుంచి రూ. 12,959.15 కోట్లకు పడిపోయింది. నికరలాభం 16 శాతం క్షీణతతో రూ. 3,190.12 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ. 3775.44 కోట్లు. ఇక... ఎబిటా విషయానికొస్తే 11 శాతం క్షీనతతో రూ. 4,473.04 కోట్ల నుంచి రూ. 3,992.16 కోట్లకు పడిపోయింది. ఎబిటా మార్జిన్‌ 31.6 శాతం నుంచి 30.8 శాతానికి తగ్గింది. కాగా... ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో మాత్రం పెరుగుదల నమోదైంది. ఈ విభాగంలో ఆదాయం ఒక శాతం వృద్ధితో రూ. 3,725.55 కోట్లకు చేరింది. హోటల్స్‌ యూనిట్‌ ఆదాయం 55.8 శాతం క్షీణతతో రూ. 127.24 కోట్లకు తగ్గింది. అగ్రి బిజినెస్‌ వ్యాపార ఆదాయం 21.4 శాతం వృద్ధితో రూ. 4,091.27 కోట్లకు పెరిగింది.


కంపెనీ ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఈ రోజు ఇంట్రాడేలో ఐటీసీ దాదాపు ఒకటిన్నర శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ. 215.35 కు చేరింది. ప్రస్తుతం అరశాతానికి  పైగా లాభంతో రూ. 213.90 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ రోజు 2.44 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ. 2,63,409 కోట్లకు చేరింది. 

Updated Date - 2021-07-26T22:37:37+05:30 IST