Australia మంత్రివర్గంలో రికార్డ్ స్థాయిలో మహిళలు

ABN , First Publish Date - 2022-06-01T17:20:38+05:30 IST

ఆస్ట్రేలియా మంత్రివర్గం(Australia Cabinet)లో మొదటిసారి రికార్డు స్థాయిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది. బుధవారం ఆస్ట్రేలియా నూతన ఫెడరల్ మంత్రివర్గం(Australia's new federal ministry) ప్రమాణ స్వీకారం చేసింది. ఇందులో మతం, సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించారు..

Australia మంత్రివర్గంలో రికార్డ్ స్థాయిలో మహిళలు

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియా మంత్రివర్గం(Australia Cabinet)లో మొదటిసారి రికార్డు స్థాయిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది. బుధవారం ఆస్ట్రేలియా నూతన ఫెడరల్ మంత్రివర్గం(Australia's new federal ministry) ప్రమాణ స్వీకారం చేసింది. ఇందులో మతం, సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించారు. అంతే కాకుండా గతంతో పోలిస్తే ఈసారి మంత్రి వర్గంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తంగా 23 మంత్రులు ఉండగా ఇందులో 10 మంది మహిళలే ఉన్నారు. మునుపటి స్కాట్ మారిసన్ లిబరల్ నేషనల్ కొయలేషన్ ప్రభుత్వంలో ఏడుగురు మహిళలు మాత్రమే ఉండేవారు. ప్రస్తుత ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్ ఈ సంఖ్యను పదికి పెంచారు. ఎడ్ హుసిక్(వాణిజ్య మంత్రి), అన్నె అలై(యువజన మంత్రి) ఆస్ట్రేలియా క్యాబినెట్‌లో మొదటి ముస్లిం మహిళలు. లిండా బుర్నే(స్వదేశీ వ్యవహారాల మంత్రి) మొదటి ఆదివాసీ మహిళా మంత్రి. లిండా తన ప్రమాణ స్వీకారానికి కంగారూ తోలుతో చేసిన కోట్ ధరించి వచ్చారు.

Updated Date - 2022-06-01T17:20:38+05:30 IST