రికార్డుల్లోనే పండ్ల మొక్కలు

ABN , First Publish Date - 2020-11-27T05:46:07+05:30 IST

మండలం లో పలు గ్రామాలలో ఉపాధిహామీ, సెర్ఫ్‌ ఆ ధ్వర్యంలో రైతులు నాటిన పండ్ల మొక్కలు రికార్డులకే పరిమితమయ్యాయి.

రికార్డుల్లోనే పండ్ల మొక్కలు
నివేదికలను పరిశీలిస్తున్న అడిషనల్‌ పీడీ

ప్రజా వేదికలో తేటతెల్లం

కొనకనమిట్ల, నవంబరు 26 : మండలం లో పలు గ్రామాలలో ఉపాధిహామీ, సెర్ఫ్‌ ఆ ధ్వర్యంలో రైతులు నాటిన పండ్ల మొక్కలు రికార్డులకే పరిమితమయ్యాయి. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా అడిషనల్‌ పీడీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ని ర్వహించిన ప్రజావేదికలో ఈ విషయం తేట తెల్లమైంది. మండలంలో 26 గ్రామ పంచాయతీలలో 2293 పనులకుగాను రూ. 19.66 కోట్లు ఖర్చు చేశారు.  ఇంజవర్తిపాడు, గొట్లగట్టు, చినమనగుండం, చినారికట్ల, నాగరాజుకుంట, మునగపాడు తదితర గ్రామాలలో ఉపాధిహామీ, సెర్ఫ్‌ ఆధ్వర్యంలో సాగు చేసుకున్న పండ్ల తోటలు రికార్డులలో మాత్రమే ఉన్నాయి. సామాజిక బృందం నిర్వహించిన తనిఖీల్లో 90 శాతం మొక్కలు లేవని  డీఆర్‌పీలు ప్రజావేదిక దృష్టికి తె చ్చారు. గ్రామాలలో రైతులను వివరణ కోరగా మొక్కల బి ల్లులు రాకపోవడంతో దున్ని పైరు వేసుకొన్నట్లు, కొన్ని నీటి తడులు లేక చనిపోయినట్లు రైతులు తెలిపారని వారు వివ రించారు. కాట్రగుంట గ్రామంలో కందకాల పనులు జరిగాయని,  ఆ పనులు చేసిన చో ట వాటి జాడ లేదని టీఏను, ఎఫ్‌ఏను విచారించగా రైతులు పొలం దున్నడంతో పనులు కనిపించకుండా పోయాయని తెలిపారు. గు రువారం 16 గ్రామాలకు సంబంధించి ప్రజా వేదిక నిర్వహించారు. మిగిలిన 10 గ్రామా లకు శుక్రవారం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో డ్వామా జిల్లా విజిలెన్స్‌ అధికారి శోభన్‌బాబు, మార్కాపురం క్లష్టర్‌ ఏపీడీ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఆర్పీ ఎం.బుజ్జి, ఏపీవోలు నాగరాజు, రవిబా బు, వెలుగు ఏపీఎం గోపాల్‌రెడ్డి, సీసీలు, టీఏలు, ఎఫ్‌ఏలు, డీఆర్పీలు, వీఎ్‌సఏలు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-11-27T05:46:07+05:30 IST