రికార్డులను సజావుగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-30T05:50:35+05:30 IST

రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం వీఆర్‌వోలకు ఓరియంటేషన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేకాధికారులు (వీఆర్‌వోలు) కీలకపాత్ర పోషించాలని తెలిపారు.

రికార్డులను సజావుగా నిర్వహించాలి
రాజంపేటలో భూముల సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి, సెప్టెంబరు 29: రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం వీఆర్‌వోలకు ఓరియంటేషన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేకాధికారులు (వీఆర్‌వోలు) కీలకపాత్ర పోషించాలని తెలిపారు. లేఅవు ట్‌, బిల్డింగ్‌ అనుమతులను తీసుకునే విధంగా పట్టణ వాసులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే తదితరులు పాల్గొన్నారు.

ఎల్లాపూర్‌ తండాలో పోడు భూముల సర్వే

రాజంపేట: మండలంలోని ఎల్లాపూర్‌ తండా గ్రామం లో గురువారం పోడు భూముల సర్వేను కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 డిసెంబరు 13వ తేదీలోపు పోడు భూముల కబ్జాలో ఉన్న గిరిజనులకు ఫారెస్ట్‌ అధికారులు సర్వేచేసి పట్టా ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. రెవెన్యూశాఖ పంచాయతీశాఖ పోలీసుశాఖ ఫారెస్ట్‌ అధికారులు గ్రామాల్లో పోడు భూముల సర్వేచేసి అర్హులకు పట్టా అందించాలని గ్రామాల్లో రైతులకు ఏదైన సలహాలు సమాచారం కోసం అధికారులను సంప్రదించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ విద్యాసాగర్‌, తహసీల్ధార్‌ జానకి, ఎంపీడీవో బాలకిషన్‌, రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


మూడు గ్రామాల్లో పోడు భూముల సర్వే

భిక్కనూర్‌: మండలంలోని సిద్ధరామేశ్వర్‌నగర్‌, గుర్జకుంట, బస్వాపూర్‌ గ్రామాల్లో పోడు భూముల సర్వే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధికారులు సర్వే నిర్వహించి పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం ఎంపీడీవో అనంత్‌రావు మాట్లాడుతూ మండలంలో పోడు భూముల సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T05:50:35+05:30 IST