రెండేళ్లలో 2,000 మంది నియామకం

ABN , First Publish Date - 2022-06-18T08:45:17+05:30 IST

రిటైల్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లోని కంపెనీలకు కృత్రిమ మేధ, క్లౌడ్‌ టెక్నాలజీల్లో ప్రొడక్ట్‌లను అభివృద్ధి చేసి అందిస్తున్న ప్యాక్టెరా ఎడ్జ్‌ 2024 నాటికి మరో 2,000 మంది ఐటీ నిపుణులను నియమించుకోవాలని భావిస్తోంది అమెరికాకు చెందిన ప్యాక్టెరా ఎడ్జ్‌కి అనుబంధంగా ఉన్న భారత కంపెనీ 2018లో హైదరాబాద్‌లో డెలివరీ కేంద్రం ప్రారంభించింది.

రెండేళ్లలో 2,000 మంది నియామకం

ప్యాక్టెరా ఎడ్జ్‌ కంట్రీ హెడ్‌ నారాయణ మూర్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రిటైల్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లోని కంపెనీలకు కృత్రిమ మేధ, క్లౌడ్‌ టెక్నాలజీల్లో  ప్రొడక్ట్‌లను అభివృద్ధి చేసి అందిస్తున్న ప్యాక్టెరా ఎడ్జ్‌  2024 నాటికి మరో 2,000 మంది ఐటీ నిపుణులను నియమించుకోవాలని భావిస్తోంది అమెరికాకు చెందిన  ప్యాక్టెరా ఎడ్జ్‌కి అనుబంధంగా ఉన్న భారత కంపెనీ 2018లో హైదరాబాద్‌లో డెలివరీ కేంద్రం ప్రారంభించింది. కేవలం ముగ్గురు నిపుణులతో ఇక్కడ  కార్యకలాపాలను ప్రారంభించామని, ప్రస్తుతం 1,000 మంది పని చేస్తున్నారని ప్యాక్టెరా ఎడ్జ్‌ కంట్రీ హెడ్‌ నారాయణ మూర్తి తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌లో మరో డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని.. ఆ తర్వాత ఇతర నగరాలకు కార్యకలాపాలను విస్తరించనున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో రెండో డెలివరీ కేంద్రం ఏర్పాటుకు రూ.7.6 కోట్లను వెచ్చించనున్నట్లు మూర్తి చెప్పారు. 

Updated Date - 2022-06-18T08:45:17+05:30 IST