రెడ్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2020-12-03T05:25:48+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. మావోయిస్టు పార్టీ చేపట్టే దాడులకు మార్గ నిర్దేశం చేసే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిళ్ల ఆర్మీ (పీఎల్‌జీఏ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా డిసెంబరు 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు నిర్వహించే వారోత్సవాలపై జిల్లా పోలీసులు గట్టి నిఘాను సారించారు. జిల్లాలో పీఎల్‌జీఏ కదలికలు అంతగా లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

రెడ్‌ అలర్ట్‌

పీఎల్‌జీఏ వారోత్సవాలపై పోలీసుల నిఘా

మరింత బలపడేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహరచన

అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల పకడ్బందీ చర్యలు

నూతన ఓఎస్డీ ఆధ్వర్యంలో యాక్షన్‌ ప్లాన్‌

ఏజెన్సీ గ్రామాల్లో భయానక వాతావరణం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. మావోయిస్టు పార్టీ చేపట్టే దాడులకు మార్గ నిర్దేశం చేసే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిళ్ల ఆర్మీ (పీఎల్‌జీఏ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా డిసెంబరు 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు నిర్వహించే వారోత్సవాలపై జిల్లా పోలీసులు గట్టి నిఘాను సారించారు. జిల్లాలో పీఎల్‌జీఏ కదలికలు అంతగా లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు పోలీసులు అటు మావోలతో ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో భయానక వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ నక్సల్స్‌ జిల్లాలో సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నాలుగైదు నెలలుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరంగా అడవులను జల్లెడ పడుతూ కూంబింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఉమ్మడి జిల్లా అడవుల్లో ఇప్పటికే రెండు సార్లు ఎన్‌కౌంటర్లు జరగడం, కొందరు సానుభూతి పరులను అదుపులోకి తీసుకోవడం, ఒక దళ సభ్యుడు లొంగిపోవడం, మరొక దళ సభ్యుడు ఎన్‌కౌంటర్‌లో మరణించడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పీఎల్‌జీఏ వారోత్సవాలు జరగడంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైనట్లు చెబుతున్నారు.

యువతను ఆకర్షించే ప్రయత్నాలు..

జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని యువతే లక్ష్యంగా మావో యిస్టు పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమ యంలోనే పలువురు యువకులు మావోయిస్టు పార్టీలో చేరినట్లు పోలీసులు సమాచారాన్ని సేకరించారు. మరోసారి వారోత్సవాల పేరిట గ్రామాల్లో సంచరిస్తున్న మావోయిస్టులు యువతే లక్ష్యంగా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లొంగి పోయిన దళ సభ్యుడి ద్వారా పోలీసులు మరింత సమాచారాన్ని సేకరించి అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లో చని పోయిన నేరడిగొండ మండలానికి చెందిన జుగ్నక్‌ బాజీరావ్‌ కూడా పార్టీలో చేరిన మూడు మాసాల్లోనే ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో ఎదురుదెబ్బ తగిలిన మావోయిస్టు పార్టీ అదే స్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

పోలీసుల కట్టడి చర్యలు..

ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలైనట్లు పసి గట్టిన పోలీసులు పక్కా సమాచారంతో ముందుకెళ్తున్నారు. పెద్ద ఎత్తు న కూంబింగ్‌లు, తనిఖీలు చేపడుతున్నారు. మావోయిస్టుల ఆగడాల కు అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా రు. రహస్య సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుని జి ల్లాలో మావోల కదలికలను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తు న్నారు. కొద్దిరోజుల క్రితమే ఒకదళ సభ్యున్ని ఎన్‌కౌంటర్‌లో హతమర్చి మరొక సభ్యున్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ను పట్టుకునేందుకు ఉమ్మడి జిల్లా అడవులను జల్లెడ పడుతున్నారు. కొద్దిరోజులుగా పోలీసుల వ్యూ హాలు ఫలించడంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.

యాక్షన్‌ ప్లాన్‌ అమలు...

ఉమ్మడి జిల్లా పరిధిలో మావోయిస్టుల కదలికలు మళ్లీ పెరిగి పోవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది. ఓఎస్డీ ఎం.రాజేష్‌చంద్ర ఆధ్వర్యంలో మావోల కట్టడికి యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మావోల ఏరివేతకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తు న్నారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునే మావోయిస్టుల కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మావోల కట్టడిలో కొంత మేరకు సఫలీకృతమైన జిల్లా పోలీసు యంత్రాంగానికి ఓఎస్డీ నియామకం మరింత బలాన్ని చేకూరుస్తుంది. పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘాను సారిస్తున్నారు.

Updated Date - 2020-12-03T05:25:48+05:30 IST