తమిళనాట 14 జిల్లాల్లో ‘రెడ్‌ అలర్ట్‌’

ABN , First Publish Date - 2021-11-28T08:23:25+05:30 IST

ఈశాన్య రుతుపవనాల తీవ్రత, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 14 జిల్లాల్లో ఆదివారం భారీగా వర్షాలు

తమిళనాట 14 జిల్లాల్లో ‘రెడ్‌ అలర్ట్‌’

చెన్నై, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల తీవ్రత, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 14 జిల్లాల్లో ఆదివారం భారీగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం.. ఆయా జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. తిరువణ్ణామలై, కళ్లకుర్చి, కన్నియాకుమారి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో చెన్నై మరోమారు జలమయమైంది. ఇప్పటి వరకూ 8 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం భారీ వర్ష హెచ్చరికలుండటంతో కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్లు తమిళనాడు విపత్తుల నివారణ శాఖమంత్రి కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌ వెల్లడించారు. 

Updated Date - 2021-11-28T08:23:25+05:30 IST