డయాలసిస్‌ రోగుల కోసం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌

ABN , First Publish Date - 2022-06-30T06:24:14+05:30 IST

తిరువూరు రెవెన్యూ డివిజన్‌లో ఎక్కువ మంది డయాలసిస్‌ రోగులు ఉన్నారని, సకాలంలో వారికి అవసరమైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్నారని రెడ్‌క్రాస్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ బి.వి.ఎస్‌.కుమార్‌ తెలిపారు.

డయాలసిస్‌ రోగుల కోసం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌
డయాలసిస్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న రెడ్‌క్రాస్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ కుమార్‌

తిరువూరు, జూన్‌ 29 : తిరువూరు రెవెన్యూ డివిజన్‌లో ఎక్కువ మంది డయాలసిస్‌ రోగులు ఉన్నారని, సకాలంలో వారికి అవసరమైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్నారని రెడ్‌క్రాస్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ బి.వి.ఎస్‌.కుమార్‌ తెలిపారు. పట్టణంలోని అమరావతి మల్టీస్పెషాలిటీ వైద్యశాలలోని డయాలసిస్‌ కేంద్రాన్ని సందర్శించారు. సెంటర్‌లో అందుతున్న  సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కలెక్టర్‌ దిల్లీరావు సూచనల మేరకు రోగులున్న ఎ.కొండూరు మండలంలో పర్యటించినట్టు తెలిపారు. రోగులకు రక్తం అవవసరం అయినప్పుడు అందుబాటులో లేక కుటుంబసభ్యులు ప్రైవేటు సంస్ధల్లో రక్తం పొందాలంటే అధిక ధరల చెల్లించాల్సి వస్తుందన్నారు. కుటుంబసభ్యులను ఆయా కేంద్రాలకు రక్తం ఇచ్చేందుకు తరలించటం ఆర్థికపరమైన భారంతో కూడుకున్నదన్నారు. అందులో భాగంగానే ఆ ఇబ్బందులు తొలగించేందుకు రోగులకు అవసరమైన రక్తం ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే తక్కువకు అందించేందుకు రెడ్‌క్రాస్‌ ముందుకు వచ్చిందన్నారు. ఈ కేంద్రంలో బ్లడ్‌బ్యాంక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రక్తంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కుమార్‌ తెలిపారు. సమావేశంలో వైద్యశాల ఎండీ కోనేరు వెంకటకృష్ణన్‌, గిరిజన నాయకులు గోపిరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T06:24:14+05:30 IST