రెడ్‌క్రాస్ సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2021-07-30T06:36:19+05:30 IST
రెడ్‌క్రాస్ సేవ లు మరవలేనివని డీఎంహెచ్‌వో డాక్టర్ సుమన్‌మోహన్‌రావు అన్నారు.
డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు
సిరిసిల్ల టౌన్, జూలై 29: రెడ్‌క్రాస్ సేవ లు మరవలేనివని డీఎంహెచ్‌వో డాక్టర్ సుమన్‌మోహన్‌రావు అన్నారు. కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడానికి రెడ్‌క్రాస్ ముందుకొచ్చింది. దీనిలో భాగం గా గురువారు సిరిసిల్ల జిల్లా ప్రధాన వైద్య శాలలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, హోమ్ ఆక్సిజన్ బ్యాంక్‌ను డీఎంహెచ్‌వో సుమన్ మోహన్‌రావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ బాధి తులను ఆదుకుంటున్న రెడ్‌క్రాస్ సేవలను మరవలేమన్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అమెరికన్ ప్రవాస భారతీయ సంఘం ఔధార్యంతో ఆ క్సిజన్ కాన్సన్ట్రేటర్ సేవలను ప్రజలకు ఉచితంగా అందుబాటు లోకి వచ్చిందన్నారు. కొవి డ్ బాధితులకు ఇంటి వద్దే ఆక్సిజన్ అందించడానికి ఉపయోగిస్తారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు గుడ్ల రవి, కోశాధికారి బింగి రా జశేఖర్, కార్యానిర్వాహక క మిటీ సభ్యులు బియ్యంకార్ శ్రీనివాస్, కొవి డ్ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ మీనాక్షి త దితరులు పాల్గొన్నారు.