ఎర్రమట్టి... ఎల్లలు దాటి..

ABN , First Publish Date - 2022-05-15T06:05:32+05:30 IST

ఎర్రమట్టి ఎల్లలు దాటి పోతోంది. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో లభ్యమయ్యే ఎర్రమట్టిని కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు అనధికారికంగా తవ్వేస్తున్నారు. ఈ మట్టికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. పాలీహౌస్‌ ఫార్మింగ్‌, వెర్టికల్‌ ఫార్మింగ్‌లో ఇది బాగా ఉపయోగ పడుతున్నట్టు తేలింది. దీంతో ఈ ఎర్ర మట్టికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెట్ట ప్రాంతాల్లో కొన్నిచోట్ల మాత్రమే లభ్యమయ్యే ఈ మట్టిని విచక్షణారహితంగా తవ్వేస్తున్నారు. ఇక్కడినుంచి కాకినాడ, విశాఖ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. మైన్స్‌ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛ గా తవ్వేస్తున్నారు. ఇలా కొందరు అధికార పార్టీ నేతలు రూ.కోట్లు సొమ్ములు చేసుకుంటున్నారు.

ఎర్రమట్టి... ఎల్లలు దాటి..
జగ్గంపేట మండలం భావారం గ్రామంలోని కోనేటివారిచెరువులో ఎక్స్‌కవేటర్‌తో సాగిస్తున్న ఎర్రమట్టి తవ్వకాలు

  • మెట్టలో యథేచ్ఛగా ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు
  • రోజూ వందల లారీల్లో విశాఖ, కాకినాడ పోర్టులకు తరలింపు
  • విదేశాల్లో ఎర్రమట్టికి గిరాకీతో అక్కడికి ఎగుమతులు
  • జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పంచాయతీ భావారంలో తవ్వకాలు
  • రోజూ 100 లారీల్లో పోర్టుకు మట్టి తరలింపు.. లారీకి రూ.30వేలు
  • వంద ఎకరాల చెరువులో తవ్వకాలకు చేతులు మారిన రూ.9కోట్లు
  • అక్రమంగా రూ.కోట్లు సంపాదిస్తున్న అధికార పార్టీ నాయకులు
  • తవ్వకాలు, తరలింపులకు జగ్గంపేట కీలక నేత అండదండలు
  • మైన్స్‌, రెవెన్యూ అనుమతులు లేకుండానే తవ్వకాలు
  • చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత శాఖల అధికారులు

ఎర్రమట్టి ఎల్లలు దాటి పోతోంది. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో లభ్యమయ్యే ఎర్రమట్టిని కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు అనధికారికంగా తవ్వేస్తున్నారు. ఈ మట్టికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. పాలీహౌస్‌ ఫార్మింగ్‌, వెర్టికల్‌ ఫార్మింగ్‌లో ఇది బాగా ఉపయోగ పడుతున్నట్టు తేలింది. దీంతో ఈ ఎర్ర మట్టికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెట్ట ప్రాంతాల్లో కొన్నిచోట్ల మాత్రమే లభ్యమయ్యే ఈ మట్టిని విచక్షణారహితంగా తవ్వేస్తున్నారు. ఇక్కడినుంచి కాకినాడ, విశాఖ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. మైన్స్‌ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛ గా తవ్వేస్తున్నారు. ఇలా కొందరు అధికార పార్టీ నేతలు రూ.కోట్లు సొమ్ములు చేసుకుంటున్నారు. 

జగ్గంపేట, మే 14: జిల్లాలోని మె ట్టప్రాంతం జగ్గంపేట, ప్రత్తిపాడు, గండేపల్లి, రంగంపేట, పెద్దాపురం ప్రాంతాల్లో ఎర్రమట్టి ఉంది. ఇది నెమ్మదినెమ్మదిగా తరిగిపోతోంది. ఎ టువంటి అనుమతులు లేకుండానే కొందరు అక్రమార్కులు యంత్రాల తో మొత్తం మట్టిని తవ్వేస్తున్నారు. దీన్ని లేఅవుట్లను చదును చేయ డానికి కొంత తరలిస్తున్నప్పటికీ ఎక్కువశాతం విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. 

విదేశాల్లో మంచి గిరాకీ 

మెట్టలో లభ్యమయ్యే ఎర్రమట్టికి విదేశాల్లో మంచి గిరాకీ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కాకినాడ, విశా ఖ, చెన్నై పోర్టుల ద్వారా అక్కడికి తరలిస్తున్నారు. పాలీహౌస్‌, వెర్టికల్‌ ఫార్మింగ్‌లో వివిధ రకాల పంటల సాగుకోసం ఈ మట్టిని ఉపయోగిస్తున్నట్టు సమాచారం. జర్మనీ, అమెరికా, జపాన్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు ఈ మట్టిని ఇక్కడినుంచి ఎగుమతి చేస్తున్నట్టు స మాచారం. ఈ మట్టిలో భూసారం అధికంగా ఉండడంవల్ల ఇది ఆ వ్యవసాయంలో సత్ఫలితాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎర్ర మట్టికి గిరాకీ ఏర్పడింది. ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ మట్టి సరఫ రాదారులకు అధికార పార్టీ నేతలు అండగా ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సొమ్ములు పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నాయి. ఇక్కడినుంచి సార వంతమైన మట్టిని ఇతర ప్రాంతాల కు తరలించడంతో ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధి కారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులకు ఈ మట్టి తవ్వకం ఆదాయ వనరుగా మారిపోయిందని చెబుతున్నారు.

తవ్వకాలు ఎక్కడెక్కడంటే...

మెట్టప్రాంతాలైన గండేపల్లి మండలం సూరంపాలెం, రామేశంపేట, ఎన్టీరాజాపురం, తిరుపతి రాజాపురం గ్రామల్లోను, జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పంచాయతీ పరి ధి భావారం, మల్లిశాల లోతట్టు ప్రాంతాల్లోను, ఏలేశ్వరం మండలం కొండ తిమ్మాపురం లోను, ప్రత్తిపాడు మండ లం రాచపల్లి, ఒమ్మంగి, ఇ.గోకవ రం గ్రామాల్లోను, శంఖవ రం- కోటనందూరు మధ్య మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లోను, ఏజెన్సీ ప్రాంతంగంగవరం మండలం మల్లవరంతోపాటు విశాఖ, మన్యం జిల్లాకు మధ్య గ్రా మాల్లోను ఈ ఎర్ర మట్టి తవ్వ కాలు సాగిస్తున్నారు. ఈ గ్రా మాల్లో కొన్నిచోట్లే ఇది లభ్యమవుతుంది. ఇలా మొత్తం 500 ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వేస్తున్నారని సమాచారం. రాత్రివేళ భారీ యం త్రాలతో తవ్వకాలు జరిపి వాహనాల ద్వారా విశాఖ, కాకినాడ పోర్టులకు తరలిస్తున్నారు.

100 ఎకరాల చెరువులో..

జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పంచాయతీ పరిధి భావారం గ్రామంలోని కోనేటివారిచెరువులో ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. 100 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో తవ్వకాలకు రూ.9కోట్లు చేతులు మారినట్టు సమాచారం. ఆ పక్కనే ఉన్న రెవెన్యూ భూముల్లోను అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. వీటికి సంబంధించి రెవెన్యూ, మైన్స్‌ అధికారులనుంచి అనుమతులు తీసుకోలేదు. రాత్రిపూట భారీ యంత్రాలతో తవ్వకాలు, తరలింపు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడినుంచి రోజుకు 100 లారీలు పోర్టులకు తరలిపోతున్నాయని తెలుస్తోంది. ఒక్కోలారీ రూ.30వేలు పలుకుతోంది. ఈ తంతు రెండు నెలలుగా జరుగుతోంది. జగ్గంపేటకు చెందిన ఓ కీలక నేత దీని వెనుక ఉండడంతో అధికారులు ఎవరూ ఈ తవ్వకాల గురించి పట్టించుకోవడం లేదు. పైగా వచ్చేనెలల్లో వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఇప్పుడు దొరికినకాడికి దోచుకునే ఉద్దేశంతో ఇష్టమొచ్చినట్టు తవ్వేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-05-15T06:05:32+05:30 IST