రూ.1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-06T07:05:06+05:30 IST

కేవీబీపురం మండల పరిధిలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందన దుంగలు పట్టుబడ్డాయి.

రూ.1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం దుంగలతో అధికారులు

కేవీబీపురం, మార్చి 5: కేవీబీపురం మండల పరిధిలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందన దుంగలు పట్టుబడ్డాయి. డీఎస్పీ వెంకటయ్య తెలిపిన వివరాల మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణాపై తిరుపతి టాస్క్‌ఫోర్సు బృందం నిఘా ఉంచింది. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కేవీబీపురం మండలం ఎస్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన చెంచయ్య, చెంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో స్థానికులు ప్రశాంత్‌, వెంకటే్‌షను విచారించారు. ఆ మేరకు.. ఎస్‌ఎల్‌పురం సమీపంలోని అటవీప్రాంతంలో దాచిన రూ.1.5 కోట్ల విలువైన 138 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు గిరిధర్‌, మురళీధర్‌, సీఐ వెంకటరవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T07:05:06+05:30 IST