ఆర్‌ఈడీ ఆనంద్‌కు నిర్మాణ పనుల వివరిస్తున్న అధికారులు
- టీఎస్టీపీపీ, ఎఫ్‌జీడీల పరిశీలన
జ్యోతినగర్, మార్చి 26 : ఎన్టీపీసీ ఆర్‌ఈడీ(దక్షిణ) నరేష్ఆనంద్ శనివారం రామ గుండంలో పర్యటించారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన రామ గుండం ఎన్టీపీసీలో నిర్మిస్తన్న ఫ్లూగ్యాస్ డీ సల్ఫరైజేషన్(ఎఫ్‌జీడీ) ప్లాంటును, 200 మెగావాట్ల 1, 3వ యూనిట్ల ఈఎస్పీలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న తెలం గాణ సూపర్‌థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్టీపీపీ) మొదటి యూనిట్ కంట్రోల్ రూం ను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పురోగతి తదితర వివరాలను అధికారు లు ఆర్ఈడీకి వివరించారు. అనంతరం రామగుండం ప్రాజెక్టు, టీఎస్టీపీపీ, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వ హించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచిం చారు. ఎన్టీపీసీకి చెందిన వివిధ యూనియన్లు, అధికారుల సంఘం తదితర అసోసి యేషన్ ప్రతినిధులతో ఆర్‌ఈడీ సమావేశమయ్యారు. ఆర్‌ఈడీ గౌరవార్థం కాకతీయ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్‌ఈడీ వెంట రామ గుండం సీజీఎం సునిల్‌కుమార్ ఇతర అధికారులున్నారు.