హామీలు నెరవేర్చకుంటే..ప్రగతి భవన్‌ ముందు ఆత్మహత్యలే

ABN , First Publish Date - 2022-05-28T09:40:30+05:30 IST

మేడ్చల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇక చాలు.. ఓపిక నశించింది.. చావో.. రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. 2018లో ఇచ్చిన హామీలను

హామీలు నెరవేర్చకుంటే..ప్రగతి భవన్‌ ముందు ఆత్మహత్యలే

-రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

-రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి

మేడ్చల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇక చాలు.. ఓపిక నశించింది.. చావో.. రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. 2018లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రగతి భవన్‌ ఎదుట ప్రతి రెడ్డి బిడ్డ పెట్రోల్‌ డబ్బాతో దేనికైనా సిద్ధంగా ఉండాలి’’అని రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతో్‌షరెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రెడ్డి జేఏసీ, రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్డి మహా సంగ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతో్‌షరెడ్డి మాట్లాడారు. 2018లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 50ఏళ్లు నిండిన రైతుకు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్‌ను నమ్మామని, అండగా ఉంటే మరోసారైనా ఆదరిస్తామని, లేకపోతే తగిన బుద్ధి చెప్తామన్నారు. పార్టీలకతీతంగా సమస్యలపై రెడ్లందరూ ఐక్యంగా పోరాడాలని సంతో్‌షరెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-05-28T09:40:30+05:30 IST