ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే విమోచన దినం విస్మరణ

Sep 15 2021 @ 02:18AM
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రుతి

వలిగొండ, సెప్టెంబరు 14: ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సీఎం కేసీఆర్‌ అధి కారికంగా నిర్వహించడంలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ఆరోపించారు. మండలంలోని అర్రూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలం గాణ ఉద్యమంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సమైక్య పాలకులను డిమాండ్‌ చేసిన కేసీఆర్‌ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విస్మరించారని ఆమె ప్రశ్నిం చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించేంతవరకు బీజేపీ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈనెల 17న నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరుకానున్నారని, ఈ సభను విజయ వంతం చేయాలని పార్టీ శ్రేణులను ఆమె కోరారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అఽధ్యక్షతన నిర్వహించిన సమావే శంలో రాష్ట్ర ఉపాఽధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా ఇన్‌చార్జి నందకుమార్‌ యాదవ్‌, కాసం వెంకటేశ్వర్లు, కడమంచి రమేష్‌ దాసరి మల్లేశం, పోతంశెట్టి రవీందర్‌, కర్ణాటి ధనుంజయ్య, పాశం భాస్కర్‌,  నర్ల నర్సింగ్‌రావు, నరేందర్‌ పాల్గొన్నారు. 

తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి 

 భువనగిరి రూరల్‌/వలిగొండ/తుర్కపల్లి (బొమ్మలరామారం): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భువనగిరి, వలిగొండ,  తహ సీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దం తూరి సత్తయ్యగౌడ్‌, బందారపు లింగస్వామి, కనతాల అశోక్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మత్సగిరి, జగన్‌మోహన్‌ రెడ్డి, చందా మహేందర్‌ గుప్తా, మాయ దశరథ పాదరాజు  ఉమాశంకర్‌రావు జగ్గర్ల ఆనంద్‌, రవికుమార్‌ పాల్గొన్నారు. 


Follow Us on: