తెలంగాణలో కొనసాగుతున్న నిజాం పాలన

Sep 17 2021 @ 23:41PM
మల్దకల్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

- బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్‌ 

- జిల్లా వ్యాప్తంగా విమోచన దినోత్సవం

- జాతీయ జెండాను ఆవిష్కరించిన నాయకులు

అలంపూరు/ అయిజ/ గట్టు/ మల్దకల్‌/ కేటీదొడ్డి/ ఉండవల్లి, సెప్టెంబరు 17 : దేశానికి స్వాతంత్య్ర సిద్ధిం చి 75 సంవత్సరాలు పూర్తయినా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నిజాం పాలన కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్‌ విమర్శించారు. అలంపూర్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగ మద్దిలేటి ఆధ్వ ర్యంలో శుక్రవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు మధు సూదన్‌ గౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్‌ ముఖ్యఅతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్క రించారు. తెలంగాణ ఉద్యమంలో అలంపూరుకు చెందిన చంద్రశేఖర్‌ రెడ్డి, గడియారం రామకృష్ణశర్మలు విశేషంగా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి నరేష్‌కుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగమల్లయ్య, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యాక్షుడు ఈశ్వరయ్య, పట్టణ యువమోర్చా అధ్యక్షుడు శరత్‌ బాబు, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్‌, మండల అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి, మండల యువమోర్చా అధ్యక్షుడు సుధాకర్‌యాదవ్‌, కార్యకర్తలు వరప్రసాద్‌, రాజు, శేఖర్‌ పాల్గొన్నారు. 


- తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరిం చుకొని శుక్రవారం అయిజ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధాని నరేంద్రమోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు నర్సింహయ్య శెట్టి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షుడు మేకల ఆంజనేయులు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్య క్షుడు వీరయ్యాచారి, కన్వీనర్‌ అంతంపల్లి కృష్ణ, షరీఫ్‌, పల్లయ్య, ప్రహ్లాద, షబ్బీర్‌, రాములు పాల్గొన్నారు. 


- గట్టు మండల కేంద్రంతో పాటు బలిగెరలో శుక్రవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. బలిగెర బస్టాండు ఆవరణలో దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు బలిగెర శివారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గట్టు బస్టాండు ఆవరణలో బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల యువ మోర్చా అధ్యక్షుడు కొళాయి భాస్కర్‌, నాయకులు మధుసూదన్‌రావు, మోహన్‌ గౌడ్‌, జయ సింహారెడ్డి, రాజప్ప, అంజి, వీరశేఖర్‌ గౌడ్‌  పాల్గొన్నారు. 


- మల్దకల్‌ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు పాలవాయి రాములు, నాయకులు దామ నాగరాజు, ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మన్న, కాంట్రాక్టర్‌ గోవిందు, తిమ్మప్ప, దామ వెంకటేశ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రకాశ్‌, మహేశ్‌, దామ నరేశ్‌, బుడ్డన్న, తిరుపతిరెడ్డి, వాసిరెడ్డి, వీరన్నగౌడు తదితరులు పాల్గొన్నారు. 


- కేటీదొడ్డిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు మహానందిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అమరవీరుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మహాదేవ్‌, నాయకులు శ్రీపాదరెడ్డి, డి.వీ రేష్‌, శంకర్‌ నాయక్‌, పద్మారెడ్డి, సూర్యకాంతరెడ్డి, రాముడు, శ్రీను, రంగారెడ్డి, జంగిలప్ప, తిరుపతి, వీరన్న, వాచ్యనాయక్‌, వీరేష్‌రెడ్డి, దీప్లానాయక్‌, నర్సిం హులు పాల్గొన్నారు. 


బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

ఉండవెల్లిలో బీజేపీ నాయకులను పోలీసులు ముం దస్తుగా అరెస్టు చేసి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పిడుగు వెంకటేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేస్తామన్న భయంతో ముంద స్తు అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండు చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో మహేంద్ర, పాల్వాయి వెంకటేష్‌ గౌడు, కృష్ణ ఉన్నారు. 

అయిజలో నిర్వహించిన విమోచన వేడుకల్లో బీజేపీ నాయకులు


Follow Us on: