కొత్త ఫీచర్లతో రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్..

ABN , First Publish Date - 2021-01-10T01:46:14+05:30 IST

కొత్త ఫీచర్లతో రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్..

కొత్త ఫీచర్లతో రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్‌బ్రాండ్ రెడ్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ బీఐఎస్ సర్టిఫికేషన్‌ను అందుకుంది. భారతదేశంలో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.


రెడ్‌మి నోట్ 10 ప్రో 5 జీని ఈ వారం ప్రారంభంలో యూఎస్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్‌లో ఉంచారు. రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ 6 జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ నంబర్‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కూడా బీఐఎస్ వెబ్‌సైట్ ధృవీకరించింది. అయితే రెడ్‌మి నోట్ 10 ప్రో 5 జీ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత ఉంటుందనేది కంపెనీ ప్రకటించలేదు.

Updated Date - 2021-01-10T01:46:14+05:30 IST