కొత్త ఫీచర్లతో రెడ్ మి నోట్ 10ఎస్

ABN , First Publish Date - 2021-05-04T23:13:05+05:30 IST

కొత్త ఫీచర్లతో రెడ్ మి నోట్ 10ఎస్

కొత్త ఫీచర్లతో రెడ్ మి నోట్ 10ఎస్

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్ మి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో రెడ్‌మి నోట్ 10 ఎస్ అందుబాటులోకి తీసుకోస్తోంది. భారత మార్కెట్ లో మే 13న విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ గతంలో చాలా సందర్భాలలో లీక్ అయ్యింది. చివరకు షియోమి తన రాకను ధృవీకరించింది. లాంచ్ ఈవెంట్ వాస్తవంగా కంపెనీ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా నిర్వహించబడుతుంది. రెడ్‌మి నోట్ 10 ఎస్ ప్రపంచవ్యాప్తంగా మార్చిలో ఆవిష్కరించబడింది. ఇది 6.43-అంగుళాల పూర్తి-హెచ్‌డి తోపాటు అమోలెడ్ హోల్-పంచ్ డిస్ ప్లేతో వస్తుంది. 

Updated Date - 2021-05-04T23:13:05+05:30 IST