పెరిగిన ఆస్తి పన్ను తగ్గించండి : వైస్‌చైర్మన్‌

ABN , First Publish Date - 2022-07-01T05:39:44+05:30 IST

మున్సిపాలిటీలో భూమి మార్కెట్‌ విలువ ఆధారంగా పెరిగిన ఆస్తిపన్నులో కొందరికి ఎక్కువగా పన్ను వచ్చిందనే ఫిర్యాదులపై వస్తున్నాయని వెంటనే వాటిని పరిశీలించి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింకా వెంకటాచలపతి సూచించారు.

పెరిగిన ఆస్తి పన్ను తగ్గించండి : వైస్‌చైర్మన్‌

మదనపల్లె, జూన్‌ 30: మున్సిపాలిటీలో భూమి మార్కెట్‌ విలువ ఆధారంగా పెరిగిన ఆస్తిపన్నులో కొందరికి ఎక్కువగా పన్ను వచ్చిందనే ఫిర్యాదులపై వస్తున్నాయని వెంటనే వాటిని పరిశీలించి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింకా వెంకటాచలపతి సూచించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌ప ర్సన్‌ మనూజ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా చైర్‌ప ర్సన్‌ మాట్లాడుతూ కౌన్సిలర్లు అభీష్టం మేరకే ఎక్కువగా డ్రైనేజీ పనులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ ఆస్తి పన్ను పెంపు విషయమై సమా వేశంలో ప్రస్తావించారు. ఇందుకు కమిషనర్‌ జి.రఘునాథరెడ్డి స్పందిస్తూ రివిజన్‌ ఫిటిషన్‌ (ఆర్‌పీ)కు దరఖాస్తు చేసుకుంటే, ఇంటి నిర్మాణ కొలతలు తీసి, వారంలోగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. మాజీసైనికులకు మున్సిపాలిటీలో ఇంటిపన్ను మిన హాయింపు ఉందని, అర్హులకు అవకాశం కల్పించాలని జింకా కౌన్సిల్‌ దృష్టికి తెచ్చారు. శానిటేషన్‌లో దినసరి, ఔట్‌సోర్సింగ్‌ పద్దతిలో పనిచేస్తున్న కార్మికులకు ఎప్పటికప్పుడు వేతనాలు అందేలా చూడాలని కోరారు. అలాగే నీరుగట్టువారిపల్లెలో చేనేత కార్మికుల కు ఆస్తి పన్ను కమర్షియల్‌ నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెసి డెన్షియల్‌కు మార్పు చేయాలని కోరారు. ఆరుమగ్గాల వరకు రెసిడెన్షియల్‌ కింద, ఆపై ఉన్న వారికి, ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి చేనేత మగ్గాలు ఏర్పాటు చేసిన నిర్మాణాలకు కమర్షియల్‌ కింద పన్ను వర్తిస్తుందని కమిషనర్‌ సమాధానమిచ్చారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బి.ఎ.నూర్‌ఆజాం మాట్లాడుతూ పట్టణం గుండా వెళ్తున్న బహుదా, బుగ్గకాలువల్లో వ్యర్థాలు వేయడం ద్వారా దుర్వాసన వస్తోందని కౌన్సిల్‌ దృష్టికి  తెచ్చారు. మరో కౌన్సి లర్‌ పెరవలి రాజేష్‌ మాట్లాడుతూ పట్టణంలో 650 వరకూ అనుమతి లేని కొళాయి లు ఉన్నాయని, వాటికి డిపాజిట్‌ చెల్లించినా పన్ను పరిధిలోకి రాలేదని, కొందరికి కొళాయి లేకున్నా..పన్ను వస్తున్నట్లు తెలిపారు.  అజెండాలోని ఏడు అంశాలనూ కౌన్సిల్‌ ఏకగీవ్రంగా తీర్మానించింది.

 

Updated Date - 2022-07-01T05:39:44+05:30 IST