ఎస్‌ఎ్‌సబీఎన కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల నేతల మెరుపు ధర్నా

ABN , First Publish Date - 2021-11-12T06:36:20+05:30 IST

యిడెడ్‌ విద్యాసంస్థలను కొనసాగించాలని, లాఠీచార్జ్‌పై విచారణ చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థి సంఘాల నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు.

ఎస్‌ఎ్‌సబీఎన కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల నేతల మెరుపు ధర్నా
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు

తగ్గని ఎయిడెడ్‌ వేడి

బలవంతంగా పోలీ్‌సస్టేషనకు  తరలించిన పోలీసులు 

10 గంటలపాటు స్టేషనలోనే...

 సీపీఐ నాయకుల జోక్యంతో విడుదల 

ప్రైవేటీకరణ విరమించుకోవాలని ఎనఎ్‌సయూఐ కలెక్టరేట్‌ ముట్టడి 

పోలీస్‌ కాపలాలో ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల 

నేడు కళాశాల పాలకమండలి సమావేశం

అనంతపురం విద్య, నవంబరు 11: ఎయిడెడ్‌ విద్యాసంస్థలను కొనసాగించాలని, లాఠీచార్జ్‌పై విచారణ చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థి సంఘాల నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. టీఎన్‌ఎ్‌సఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐఎ్‌సబీ సంఘల నాయకులు గురువారం ఎస్‌ఎ్‌సబీఎన్‌ కళాశాల వద్ద అర్ధనగ్న ప్రదర్శన, ఖాళీ ప్లేట్లతో ధర్నాకు సిద్ధమయ్యారు. దీన్ని ముందే పసిగట్టిన పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు. అంబేడ్కర్‌ విగ్రహం, కళాశాల వద్ద పోలీసులు సర్వ సిద్ధంగా ఉన్నారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా జడ్పీ కార్యాలయం నుంచి ఎస్‌ఎ్‌సబీఎన్‌కళాశాల వైపునకు కదిలారు.  పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంఘాల నాయకులు మెరుపువేగంతో రహదారిపై ఉన్న డివైడర్లు దూకి, కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల గేటు వద్ద నేలపై కూర్చుని, ఖాళీ ప్లేట్లతో నిరసనకు దిగారు. డీఎస్పీ, ఇతర సీఐలు, పోలీసులు వారి ధర్నాను భగ్నం చేసే యత్నం చేశారు. బలవంతంగా నాయకులను పోలీసు జీపుల్లో ఎక్కించి స్టేషన్లకు తరలించారు. అరెస్టు సందర్భంగా టీఎ న్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు గుత్తా ధనుంజయ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లాప్రధాన కార్యదర్శి మనోహర్‌, ఇతర నాయకులు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.  




 రౌడీల్లా నిర్బంధం !

ఎస్‌ఎ్‌సబీఎన్‌ కళాశాల వద్ద గురువారం ధర్నా చేస్తున్న టీఎన్‌ఎ్‌సఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌ ఇతర సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని నగరంలోని టూటౌన పోలీస్టేషన్‌కు తరలించారు. టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు గుత్తా ధనుంజయ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లాప్రధాన కార్యదర్శి మనోహర్‌, ఇతర నాయకులు రాజేంద్ర ప్రసాద్‌, చిరంజీవి, రమణయ్య, ఉవమహేష్‌, వంశీ తదితర నాయకులను రాత్రి 8 గంటల వరకూ స్టేషనలోనే బందీల్లా ఉంచారు. వారి నుంచి సెల్‌ఫోన్లు సైతం లాక్కున్నారు.  సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున, నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి రమణయ్య ఇతర నాయకులు స్టేషన్‌ వద్దకు చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను విడుదల చేయాలంటూ  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆఖరికి విద్యార్థి సంఘాల నాయకులను విడుదల చేశారు. కాగా టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకులను స్టేషన్‌లో ఉంచితే టీడీపీ అగ్ర నాయకులు అటువైపు వెళ్లకపోవడం గమనార్హం.



ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలి : ఎనఎ్‌సయూఐ 

అనంతపురం రైల్వే: ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎనఎ్‌సయూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌ డిమాండ్‌ చేశారు.   గురువారం  ఎనఎ్‌సయూఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ నేత శంకర్‌, మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాదాగాంధీ, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా నరేష్‌ మాట్లాడుతూ.. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను నిర్వీర్యం చేయడం అంటే దళిత, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వర్గాలకు విద్యను దూరం చేయడమేనన్నారు. పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఎయిడెడ్‌ వ్యవస్థను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారన్నారు. 42, 52 జీఓలను అడ్డు పెట్టుకుని, వందల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం కబ్జా చేసేందుకు యత్నిస్తోందన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్‌యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షులు గాజుల వాసు, క్రిష్ణ, పరమేశ్వర్‌రెడ్డి ఎనఎ్‌సయూఐ రాష్ట్ర కార్యదర్శి మల్లి, నాయకులు ఓబిలేసు, నిశాంత, నరేంద్ర, దాదు, చైతన్య, హరి, అర్షాద్‌, నరేంద్ర, రమేష్‌, తౌఫిక్‌ పాల్గొన్నారు.



ఖాకీ నీడలో కళాశాల !

అనంతపురం విద్య:  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ఎస్‌ఎ్‌సబీఎన్‌కళాశాల ఖాకీ నీడలోనే ఉంది. ఈనెల 8వ తేదీ కళాశాలలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌, దాడి జరగడంతో ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. గత 4 రోజులుగా విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాల విద్యార్థులు దశలవారీగా నిరసన ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వేలాది మంది విద్యార్థులకు న్యాయం చేయడం కోసం పలు రాజకీయ పార్టీలు కదిలాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ సైతం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడేందుకు కళాశాలకు వచ్చారు.  బాధిత విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీఎన్‌ఎ్‌సఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌ ఇతర సంఘాల నాయకులు గురువారం ధర్నా చేశారు. ఇలా వరుస సంఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో...ఎప్పుడు విద్యార్థులు లేదా విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తారోనన్న పరిస్థితుల నేపథ్యంలో నిత్యం అక్కడ పోలీసులతో పహారా కాస్తున్నారు. మరికొందరిని మఫ్టీలో నియమించారు. విద్యార్థులను, కళాశాల  సిబ్బందిని దగ్గరుండి పోలీసులు లోపలికి పంపుతున్నారు.  






విద్యార్థులతో యాజమాన్యం సమావేశం.. నేడు పాలకమండలి భేటీ

విద్యార్థుల ఉద్యమ సెగకు కళాశాల యాజమాన్యం స్పందించినట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే కళాశాలలో పాలక మండలిలోని పలువురు కీలక సభ్యులు గురువారం తొలిసారి క్లాసుకు ముగ్గురు నుంచి నలుగురు చొప్పున సుమారు 35 మంది విద్యార్థులు, కొంతమంది సిబ్బందితో కళాశాలలో అంతర్గతంగా సమావేశం నిర్వహించారు. ఈ తొలి భేటీలో పలువురు విద్యార్థులు సూటిగా కళాశాల యాజమాన్యాన్ని పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. వేలకు వేలు ఫీజులు పెంచితే కట్టలేమని, ఈ ఏడాది తగ్గించినా, వచ్చే ఏడాది నుంచి అయినా కట్టాల్సి వస్తుందని, పేద విద్యార్థులకు ఇది భారమవుతుందని తేల్చి చెప్పినట్లు సమాచారం. కళాశాలను మునుపటి లాగా ఎయిడెడ్‌గానే కొనసాగించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో  సాయంత్రం యాజమాన్యం కలెక్టర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. కళాశాలను మునుపటి లాగా ఎయిడెడ్‌గా కొనసాగిస్తారా..? లేదా ప్రైవేట్‌గానే ఉంచుతారా అన్న అంశంపై శనివారం తనకు లేఖ ఇవ్వాలంటూ కలెక్టర్‌ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు సమాచారం. దీంతో యాజమాన్యం శుక్రవారం పాలకమండలి సమావేశం నిర్వహించి, దీనిపై చర్చించిన తర్వాత కలెక్టర్‌కు లేఖ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది.  

Updated Date - 2021-11-12T06:36:20+05:30 IST