తగ్గనున్న స్టీల్‌ ధర

ABN , First Publish Date - 2022-05-23T08:41:19+05:30 IST

దేశంలో స్టీల్‌ ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధాన ముడి పదార్ధాలైన కోకింగ్‌ కోల్‌, ఫెర్రో నికిల్‌పై దిగుమతి సుంకాలు ఎత్తివేసింది.

తగ్గనున్న స్టీల్‌ ధర

న్యూఢిల్లీ: దేశంలో స్టీల్‌ ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధాన ముడి పదార్ధాలైన కోకింగ్‌ కోల్‌, ఫెర్రో నికిల్‌పై దిగుమతి సుంకాలు ఎత్తివేసింది. దీంతో స్టీల్‌ కంపెనీల ఉత్పత్తి వ్యయం కొంతమేర తగ్గనుంది. దీనికి తోడు దేశంలో స్టీల్‌ సరఫరా మరింత పెంచేందుకు ఎగుమతులపై ఎగుమతి సుంకం 50ు పెంచింది. దీంతో ఎగుమతులు ప్రియమై దేశీయ మార్కెట్లో మరింత స్టీల్‌ అందుబాటులోకి వచ్చి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

పీఎల్‌ఐకి నష్టం: దిగుమతి సుంకం ఎత్తివేతను స్టీల్‌ పరిశ్రమ స్వాగతించింది. ఎగుమతులపై సుంకం పెంచడాన్ని మాత్రం విమర్శించింది. ఈ చర్య దేశంలో స్టీల్‌ ఉత్పత్తి పెంచడానికి ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని దెబ్బతీస్తుందని ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఏ) పేర్కొంది. 

Updated Date - 2022-05-23T08:41:19+05:30 IST