కమీషన్ల కోసం వంద ఫీట్ల రోడ్డును తగ్గించడం దారుణం

ABN , First Publish Date - 2021-07-26T04:03:51+05:30 IST

గత ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీ మేరకు నిర్మిస్తున్న బీరంగూడ-కిష్టారెడ్డిపేట రోడ్డు విస్తరణ ప నుల్లో నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారని కాంగ్రెస్‌ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాటశ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు.

కమీషన్ల కోసం వంద ఫీట్ల రోడ్డును తగ్గించడం దారుణం
బీరంగూడా-కిష్టారెడ్డిపేట రోడ్డును పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు కాట శ్రీనివాస్‌గౌడ్‌

రోడ్డు విస్తరణపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

పటాన్‌చెరు, జూలై 25: గత ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీ మేరకు నిర్మిస్తున్న బీరంగూడ-కిష్టారెడ్డిపేట రోడ్డు విస్తరణ ప నుల్లో నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారని కాంగ్రెస్‌ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాటశ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిని కలుపుతూ కిష్టారెడ్డిపేట గ్రామ శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు వంద ఫీట్ల రోడ్డు నిర్మిస్తామని చెప్పిన అధికార పార్టీ నాయకులు, అధికారులు అనేక చోట్ల రోడ్డును కేవలం 50 ఫీట్లకే పరిమితం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి అధికార పార్టీ ప్రజాప్రతినిధి రోడ్డు నాణ్యతను పట్టించుకోవడం లేదన్నారు. చెరువు మట్టితో రోడ్డును వేయడంతో వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఒత్తిడులకు తలొగ్గకుండా ప్రతీ చోట వంద ఫీట్లకు తగ్గకుండా రోడ్డును వేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆందోళనలో కాంగ్రెస్‌ నాయకులు శశిధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌, రవీందర్‌, శ్రీనివాస్‌, ప్రకాష్‌, లింగంగౌడ్‌, సత్యనారాయణ, గోపాల్‌రెడ్డి, ఆంజనేయులు, సిద్దు, మహిపాల్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-26T04:03:51+05:30 IST