ఏప్రిల్ 1 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం

Mar 31 2021 @ 18:34PM

లుధియానా: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి తమ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలు/బాలికలు ప్రయోజనం పొందనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.


ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఒక ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన ‘‘ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ ప్రభుత్వానికి చెందిన బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తూ ముందకు తెచ్చిన ప్రతిపానకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం పొందడం హర్షనీయం. మహిళా సాధికారతకు ఇది బలమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా కూడా ఉంది’’ అని ట్వీట్ చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.