ఉద్యోగుల్లో అభద్రతను తొలగించేందుకే సంస్కరణలు

ABN , First Publish Date - 2022-09-24T05:30:00+05:30 IST

రాష్ట్రంలో ఆర్టీసీ అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తునే కార్మికుల్లో ఉన్న అభద్రతను తొలగించేందుకు కొత్తగా సంస్కరణలు తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ముం దుగా ఆదిలాబాద్‌ బస్టాండ్‌ను సందర్శించారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌక ర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపోను సందర్శించి

ఉద్యోగుల్లో అభద్రతను తొలగించేందుకే సంస్కరణలు
డిపోలో కార్మికుల సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్న ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్‌

రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 24: రాష్ట్రంలో ఆర్టీసీ అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తునే కార్మికుల్లో ఉన్న అభద్రతను తొలగించేందుకు కొత్తగా సంస్కరణలు తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌  అన్నారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ముం దుగా ఆదిలాబాద్‌ బస్టాండ్‌ను సందర్శించారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌక ర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపోను సందర్శించి చైర్మన్‌ జిల్లాలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య, బస్సుల వివరాలు, సమస్యలు, వేతనాలు వంటివి అడిగి తెలుసుకు న్నారు. కరోనా తర్వాత ఉద్యోగుల్లో ఉన్న అభద్రతను తొలగించేలా సంస్కరణలు చేపట్టమని పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో ఉద్యోగులకు అనేక సమస్యలు ఉండేవని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. కార్మికులకు సకాలంలో వేతనాలు అందిస్తున్నామని తెలిపా రు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, ఆర్‌ఎం సుధా పరిమిళ, వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజానీ, ఆర్టీసీ డీఎం కల్పన, తదితరులు పాల్గొన్నారు.    

Updated Date - 2022-09-24T05:30:00+05:30 IST