దసరా నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు..

ABN , First Publish Date - 2020-10-08T19:11:56+05:30 IST

దసరా నుంచి ఉమ్మడి జిల్లాలో భూముల రిజిస్ట్రేష న్ల చార్జీలు పెరగనున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం మార్కెట్‌ రేటుకు అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్‌ల రేట్లను పెంచనున్నారు. గ్రామా లు, మున్సిపాలిటీల వారీగా భూములకు

దసరా నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు..

నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దసరా నుంచి ఉమ్మడి జిల్లాలో భూముల రిజిస్ట్రేష న్ల చార్జీలు పెరగనున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం మార్కెట్‌ రేటుకు అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్‌ల రేట్లను పెంచనున్నారు. గ్రామా లు, మున్సిపాలిటీల వారీగా భూములకు సంబంధించిన రేట్లను ధరణి వెబ్‌సై ట్లలో పొందుపరుస్తున్నారు. ప్రఽధానరోడ్లు, రేగడి, చెలక, పొలం వంటి వివరాల ను తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రస్తుత భూముల ధరలను సర్వే నెంబర్ల అధారంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు పొందు పరుస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో రెండు మూడు రోజుల్లో వివరాలను అన్ని పొందుపరిచే విధంగా ఆ శాఖ అధికారులు ధరల నమోదు లో నిమగ్నమయ్యారు. 


దసరా నుంచి కొత్త చట్టం అమలు

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం దసరా నుంచి అమలులోకి రానుంది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం సబ్‌ రిజిస్ట్రా ర్‌, తహసీల్దార్‌ కార్యాలయాల పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ల ను చేయనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ధరణి వెబ్‌సైట్‌ ద్వారా క్రయవిక్రయాలు జరుగ నున్నాయి. వ్యవసాయ భూములను తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లతో పాటు మ్యూటేషన్‌ చేయనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తో ంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మార్కెట్‌ వాస్తవ లెక్కల ప్రకారం ఈ చార్జీలను నిర్ణయించనున్నారు. 


వాస్తవ లెక్కల నమోదులో అధికారులు బిజీబిజీ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లా పరిధిలో పదిహేను రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల అధికారులు వాస్తవ లెక్కల నమోదులో నిమగ్నమయ్యారు. మొదట నిజామాబాద్‌ మున్సి పల్‌ కార్పోరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపా లిటీల మార్కెట్‌ ధరలను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఈ మున్సిపా లిటీల పరిధిలో భూముల రేట్లు మార్కెట్‌ ప్రకారం ఎలా ఉన్నాయో తీసుకుం టూ నమోదు చేశారు. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్‌ ప్రాంతాలు, విద్యాసంస్థలు, శివారు ప్రాంతాల రేట్ల ను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల అధికారులు పరిశీలించారు. మార్కెట్‌ విలువ, ఇంటి నెంబర్ల ఆధారంగా రేట్లను ధరణిలో నమోదు చేశారు. మున్సిపాలిటీల లో పూర్తి కాగానే గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ ను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామంలో ప్రధాన రోడ్ల వెంట ఉన్న భూముల ధరలు, ఒక పంట పండే భూములు, రెండు పంటలు పండేవి, చెలక భూములు, రేగడి, పొలం పండే భూములకు నీటివసతి ఆధారంగా ప్రస్తుత మార్కెట్‌ లెక్కల ప్రకారం ధరలను ధరణిలో నమోదు చేస్తున్నారు. గ్రామాల పరిధిలోని ప్రతీ సర్వే నెంబర్‌లో ఉన్న భూముల విలువను నమోదు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి చేసే విధంగా చేస్తు న్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా ఈ పనులను చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఈ పనులను చేస్తు న్నారు.


దసరా నుంచి చార్జీల పెంపు

దసరా నుంచి మొదలయ్యే భూముల రిజిస్ట్రేషన్లకు భారీగా ఫీజులు పెరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ రేట్లను ధరణిలో నమోదు చేయడం వల్ల అక్కడ ఉన్న మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఫీజులను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌ చార్జీలతో పోల్చుకుంటే భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారుల సమాచా రం బట్టి తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ధరణిపోర్టల్‌ ద్వారా అన్ని కార్యక్రమాలు జరుగనుండడంతో భూములు కొన్న వారిపైన మరింత భారం పడనుంది. ఇప్పటికే పలు విధాలుగా పన్నులు పెరి గాయి. రిజిస్ట్రేషన్ల చార్జీలు పెరిగితే సామాన్యుడికి మరింత ఇబ్బందు లు తలెత్తనున్నాయి.  ప్రభుత్వానికి మాత్రం భారీగా అదాయం పెరుగనుంది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 8 నుంచి 10 కోట్ల వరకు ఆదా యం వస్తోంది. దసరా నుంచి మొదలయ్యే రిజిస్ర్టేషన్ల ద్వారా మరింత ఎక్కవ ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో భూములకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ రేట్లను ధరణిలో ఎంట్రీ చేస్తున్నామని ఉమ్మడి జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ రిజిస్ట్రార్‌ రవీంద ర్‌రావు తెలిపారు. మరో రెండు లేదా మూడు రోజులలో పూర్తి వివరాలను నమోదు చేస్తామ న్నారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు ద్వారా భూములు కొనేవారిపై మరింత భారం చార్జీ రూపంలో పడనుంది.

Updated Date - 2020-10-08T19:11:56+05:30 IST