నేటితో ముగియనున్న ఐటీఐ ప్రవేశాల రిజిసే్ట్రషన

ABN , First Publish Date - 2022-06-30T06:01:45+05:30 IST

ఐటీఐ తరగతుల నూతన ప్రవేశాలకు రిజిస్ర్టేషన గురువారంతో ముగియ నుంది. రిజిస్ర్టేషన చేసుకున్న విద్యార్థులు వారి ఒరిజనల్‌ సర్టిఫికెట్లను ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వెరిఫికేషన చేయించుకోవాలి

నేటితో ముగియనున్న ఐటీఐ ప్రవేశాల రిజిసే్ట్రషన
ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

 సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

అనంతపురం సెంట్రల్‌, జూన 29: ఐటీఐ తరగతుల నూతన ప్రవేశాలకు రిజిస్ర్టేషన గురువారంతో ముగియ నుంది. రిజిస్ర్టేషన చేసుకున్న విద్యార్థులు వారి ఒరిజనల్‌ సర్టిఫికెట్లను ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వెరిఫికేషన చేయించుకోవాలి. అయితే కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో వెరిఫికేషన ప్రక్రియ చేపట్టలేదు. దీంతో విద్యార్థులు వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాలనుంచి అనంతపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు తరలివస్తున్నారు. అధికారులు తెలిపిన మేరకు ఉమ్మడి జిల్లాలో రెండు విడతలుగా ఐటీఐ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మొదటి విడత ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు, రెండో విడత ప్రైవేట్‌ కళాశాల ప్రవేశాలకు నిర్వహిస్తారు. దీంతో ప్రభుత్వ ఐటీఐ కళాశాల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే మొదటి విడత రిజిస్ర్టేషనకు విద్యార్థులు భారీ సంఖ్యలో నమోదు చేసుకున్నారు. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన పూర్తి చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2022-06-30T06:01:45+05:30 IST