ఆదాయం.. సర్వర్ప్‌యామి!

ABN , First Publish Date - 2021-07-23T03:54:14+05:30 IST

జిల్లాలో దస్తావేజుల రిజిసే్ట్రషన ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తరచూ సర్వర్‌ మొరాయింపు, ఇంటర్నెట్‌ సేవలో అంతరాయంతో రిజిసే్ట్రషన్లకు బ్రేక్‌ పడుతోంది.

ఆదాయం..  సర్వర్ప్‌యామి!
నెల్లూరు : సర్వర్‌ మొరాయించడంతో రిజిసే్ట్రషన శాఖ కార్యాలయంలో జనం పడిగాపులు

దస్తావేజుల రిజిసే్ట్రషనకు ఆటంకాలు

కార్యాలయాల వద్ద ప్రజలకు తప్పని నిరీక్షణ

సమస్య పరిష్కరించని ఉన్నత యంత్రాంగం

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి 


సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. రోజుకు రెండు, మూడు గంటలు కూడా సర్వర్‌ పని చేయడం లేదు. కొన్ని కార్యాలయాల్లో కంప్యూటర్లు మొరాయిస్తుండగా, ఇంకొన్ని చోట్ల ఇంటర్నెట్‌ వేగం మందగిస్తోంది. సుమారు రెండు నెలలుగా ఈ సమస్య వెంటాడుతున్నా పరిష్కారంలో ఉన్నత యంత్రాంగం వైఫల్యం చెందుతోంది. కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉంటున్న ప్రజలకు సమాధానం చెప్పలేక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. రిజిస్ర్టేషన్ల ప్రక్రియకు బ్రేకులు పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.


నెల్లూరు (హరనాథపురం), జూలై 22 : జిల్లాలో దస్తావేజుల రిజిసే్ట్రషన ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తరచూ సర్వర్‌ మొరాయింపు, ఇంటర్నెట్‌ సేవలో అంతరాయంతో రిజిసే్ట్రషన్లకు బ్రేక్‌ పడుతోంది. తమ భూమి వివరాలు చూసుకునేందుకు వెబ్‌లాండ్‌ తెరుచుకోకపోవడంతో రైతన్నలకూ నిరీక్షణ తప్పడం లేదు. రిజిసే్ట్రషన కార్యాలయాల్లో రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా రిజిసే్ట్రషన్ల కోసం వచ్చేవారు తొలుత ఈసీ (ఎనకంబరెన్స) సర్టిఫికెట్‌ తీసుకొని ఆస్తుల వివరాలు సరి చేసుకుని రిజిసే్ట్రషన్లు చేసుకొంటారు. ఈ ఈసీలతోపాటు తనఖాపత్రాలు, అమ్మకం, భాగస్వామ్యపక్ష దస్తావేజులు నకళ్ల కోసం చాలా మంది వస్తుంటారు. రిజిస్ర్టేషన్లు నిలిచి పోవడంతో ఈసీల కోసం వచ్చిన వారు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మరోవైపు బ్యాంకు రుణాలు పొందాలంటే బ్యాంకులలో ఆస్తులను తనఖా పెట్టాలి. ఇలా తనఖా పెట్టాలంటే సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో వాటిని రిజిసే్ట్రషన చేయించాలి. అయితే సకాలంలో ఆ రిజిస్టర్‌ అయిన దస్తావేజులు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 


ఆదాయానికి గండి


జిల్లాను రిజిసే్ట్రషన్ల సౌలభ్యం కోసం నెల్లూరు, గూడూరు జిల్లాలుఆ విభజించారు. ఈ జిల్లాల పరిధిలో రిజిసే్ట్రషన్ల ప్రక్రియ సజావుగా సాగితే రోజుకు 500 డాక్యుమెంట్ల రిజిసే్ట్రషన్లు జరిగి, రూ.2కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం సర్వర్‌ సమస్యతో 50 డాక్యుమెంట్ల రిజిసే్ట్రషన్లు కూడా జరగడం లేదు. దీంతో రిజిసే్ట్రషన శాఖ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.


మంగళగిరి మారినా..


మొన్నటివరకు హైదరాబాదు కేంద్రంగా నడిచిన రిజిసే్ట్రషన, స్టాంపుల శాఖను మంగళగిరికి తరలించారు. సర్వర్‌ను అప్‌డేట్‌ చేయడంలో సమస్య తలెత్తుతోంది.  డేటా వేగం పెరగలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. తరచూ మొరాయిస్తున్న సర్వర్‌ కారణంగా నిలిచిపోతున్న రిజిసే్ట్రషన్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు వేగంగా చర్యలు లేదు.  రెండు నెలల నుంచి సర్వర్‌ సమస్య వెంటాడుతున్నా పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒక్కటైన రిజిసే్ట్రషన శాఖలో కొవిడ్‌ కారణంగా రిజిసే్ట్రషన్లు పెద్దగా జరగడం లేదు. ఇప్పుడు వైరస్‌ తగ్గుముఖం పట్టి  రిజిసే్ట్రషన్లు చేయించుకుందామనుకున్నా 4 రోజులుగా సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు  స్పందించి సర్వర్‌ సమస్యను పరిష్కరించి దస్తావేజుల రిజిసే్ట్రషన్లను సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 



Updated Date - 2021-07-23T03:54:14+05:30 IST