రిజిస్ర్టేషన్ల నిలిపివేతపై పునరాలోచించాలి

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

రాష్ట్రంలో రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారని, వెంటనే రిజి స్ర్టేషన్లు జరిగేలా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని మైనార్టీ కార్పొరేషన రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

రిజిస్ర్టేషన్ల నిలిపివేతపై పునరాలోచించాలి
విలేకరులతో మాట్లాడుతున్న షబ్బీర్‌

వేంపల్లె, మే 16: రాష్ట్రంలో రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారని, వెంటనే రిజి స్ర్టేషన్లు జరిగేలా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని మైనార్టీ కార్పొరేషన రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.  గ్రంథాలయ మాజీ చైర్మన బాలస్వామిరెడ్డి, టీడీపీ రైతు వి భాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోరెడ్డి జగన్నాథరెడ్డితో కలిసి సోమవారం ఆయన వేంపల్లెలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. అధికారుల అనాలోచిత చర్యలతో ఈ మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లు రిజిస్ర్టేషన ఫీజు కోల్పోయిందని తెలిపా రు. ఢిల్లీలో రూ.2 వేల కోట్ల అప్పుకోసం ఆర్థిక మంత్రి చక్కర్లు కొట్టడం మాని,  సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి రిజిస్ర్టేషన్లు జరిగేలా చూడాలన్నారు. మూ డు నెలలుగా రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో పెళ్లిళ్లు, విద్య, అనారోగ్యం, ఇతర అవసరాల కోసం ఆస్తులను అమ్ముకోవాలన్నా అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవు తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితిని సమీక్షిం చాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు భద్ర, సోషల్‌ మీడియా పులివెందుల ఇనచార్జి గోటూరు నాగభూషణం పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST