కోలుకున్న రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2021-01-17T05:47:56+05:30 IST

కరోనా, లాక్‌డౌన్‌ దెబ్బకు కుదే లైన రిజిస్ట్రేషన్‌ శాఖ ఎట్టకేలకు కోలుకున్నది. 2020–21 ఆర్థిక సంవత్స రం తొలి మూడు క్వార్టర్లలో జిల్లావ్యాప్తంగా 70 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి.

కోలుకున్న రిజిస్ట్రేషన్‌


తొమ్మిది నెలల్లో 70 శాతం రిజిస్ట్రేషన్లు

భీమవరం జిల్లా పరిధిలో 69.65 శాతం

ఏలూరు జిల్లా పరిధిలో 70.94 శాతం

9 నెలల్లో రూ.350.89 కోట్ల ఆదాయం


ఏలూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి):కరోనా, లాక్‌డౌన్‌ దెబ్బకు కుదే లైన రిజిస్ట్రేషన్‌ శాఖ ఎట్టకేలకు కోలుకున్నది. 2020–21 ఆర్థిక సంవత్స రం తొలి మూడు క్వార్టర్లలో జిల్లావ్యాప్తంగా 70 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏలూరు రిజిస్ట్రేషన్‌ జిల్లా పరిధిలో 70.94 శాతం రిజిస్ట్రేష న్లు జరగగా, భీమవరం పరిధిలో 69.65 శాతం పూర్తయ్యాయి. తొమ్మి ది నెలల్లో జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వం రూ.350.89 కోట్ల ఆదాయం అర్జించింది. జిల్లాలో కరోనా నిరవధిక లాక్‌డౌన్‌తో గత ఏడాది రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. చాలా కార్యాలయాలు మూతప డ్డాయి. లాక్‌డౌన్‌ ముందు ప్రతి నెలా సగటున పది వేల రిజిస్ట్రేషన్లు జరగ్గా, లాక్‌డౌన్‌ నెలలైన ఏప్రిల్‌, మేలలో పదుల సంఖ్యలో రిజిస్ట్రేష న్లు జరిగాయి. సడలింపులు వచ్చిన జూన్‌, జూలైలోనూ రిజిస్ట్రేషన్లు వందల సంఖ్యను మించలేదు. మరోవైపు రియల్‌ ఎస్టేటు రంగం పూర్తిగా దెబ్బ తిన్నది. ఈ పరిస్థితుల్లో గడిచిన తొమ్మిది నెలల్లో 70 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తవడం కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. 

టాప్‌లో సజ్జాపురం, పోలవరం, ఆచంట

జిల్లాలో సజ్జాపురం, పోలవరం, ఆచంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా ల్లో నిర్ణీత లక్ష్యంకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించి జిల్లా టాప్‌లో నిలిచాయి. సజ్జాపురం రూ.9.9 కోట్లకు రూ.13.36 కోట్లు ఆదాయం వచ్చింది. పోలవరం రూ.2.59 కోట్లకు రూ.2.95 కోట్లు, ఆచంట రూ.6.04 కోట్లకు రూ.6.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఏలూరు రీజనల్‌ కార్యాలయం గడిచిన తొమ్మిది నెలల్లో టార్గెట్‌లో 65 శాతం మాత్రమే పూర్తిచేసి రూ.43 కోట్ల ఆదాయాన్ని పొందింది. తాడేపల్లిగూడెం 23.5 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. ఏలూరు జిల్లా కార్యాలయం పరిధిలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాల టార్గెట్‌ రూ.253.59 కోట్లు కాగా రూ.179.86 కోట్లు ఆదాయం వచ్చింది.  భీమవరం జిల్లా కార్యాలయం పరిధిలో భీమవరం టార్గెట్‌లో వెనుకపడింది. నిర్ణీత టార్గెట్‌లో 60 శాతం మాత్రమే పూర్తిచేసి, రూ.29.29 కోట్ల ఆదాయాన్ని పొందింది. రూ.24.75 కోట్ల ఆదాయంతో తణుకు ఎస్‌ఆర్‌వో రెండో స్థానంలో నిలిచింది.  భీమవరం పరిధిలోని 15 ఎస్‌ఆర్‌వోల టార్గెట్‌ రూ.245.58 కోట్లు కాగా రూ.171.03 కోట్ల ఆదాయం వచ్చింది. కిందటేడాది ఆదాయం రూ.385.76 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం రూ.35 కోట్లు తగ్గింది. గతేడాది 1,25,902 రిజిస్ట్రేషన్లు జరగగా ఈ ఏడాది 1,07,417 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 


Updated Date - 2021-01-17T05:47:56+05:30 IST