రిజిస్ట్రేషన్లు బందు

ABN , First Publish Date - 2020-09-09T10:57:38+05:30 IST

ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను మంగ ళవారం

రిజిస్ట్రేషన్లు బందు

ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల మూసివేత

నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు

ఉమ్మడి జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌పై ప్రభావం


నిజామాబాద్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను మంగ ళవారం మూసివేశారు. ఈ కార్యాలయాల్లో నిత్యం జరి గే లావాదేవిలను నిలిపివేశారు. కేబినెట్‌ నిర్ణయంతో వీఆర్‌వోల వ్యవస్థ రద్దు కాగా కొత్త రెవెన్యూ చట్టం ఉ త్తర్వులు వచ్చేంతవరకు ఈ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ను నిలిపివేశారు. కేవలం వివాహాలు, వీలునామాల రి జిస్ట్రేషన్‌లును మాత్రం ఆన్‌లైన్‌లో కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూలో ఇప్పటి వరకు గ్రామాలలో సేవ లు అందించిన వీఆర్‌వోల వ్యవస్థను రద్దు చేసింది. వా రి నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుంది. అన్ని మం డలాల పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఈ రికా ర్డులను భద్రపరిచారు. రెవెన్యూలో భూముల రిజిస్ట్రేష న్‌లో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించిన వీఆర్‌వో ల వ్యవస్థను రద్దు చేయడంతో భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ మూసి వేశారు. మళ్లీ ఉత్తర్వులను ఇచ్చేంత వరకు కార్యాల యాలను తెరవవద్దని ఆదేశాలు ఇచ్చారు.


నిజామాబాద్‌లోని వన్‌, టూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, బోధ న్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ సబ్‌ రిజిస్ట్రా్ట్రర్‌ కార్యాలయాలను మూసివేశారు. వీటితో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలో ని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కు ంద కార్యాలయాలను మూసివేసి ఉంచారు. మంగళవా రం ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. ప్రతి రోజు ఈ కార్యాలయాల్లో పది నుంచి యాభై వరకు రి జిస్ట్రేషన్లు చేస్తారు. కొన్ని రోజుల్లో అంతకు మించి అవు తాయి. ప్రభుత్వ ఆదేశాలతో రిజిస్ర్టేషన్లతో పాటు స్టాం ప్‌ పేపర్ల అమ్మకాలను ఆపివేశా రు. భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తామని భావించిన వారు కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మూసి ఉంచడంతో వాయిదా వేసుకున్నారు. 


ఉమ్మడి జిల్లా పరిధిలో పది కార్యాలయాలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో మొ త్తం పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉ న్నాయి. వీటి పరిధిలో ప్రతిరోజు రూ.50 లక్షల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుంది. నెలకు రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్ల మధ్య ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కరోనా వల్ల మార్చి నుంచి జూన్‌ వ రకు రిజిస్ట్రేషన్లు అంతగా జరగలేదు. ప్రభుత్వానికి ఆ దాయం రాలేదు. జూలై, ఆగస్టు నెలలో భూముల క్ర యవిక్రయాలు పెరిగాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా ల్లో రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. ప్రతీ నెల రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆదా యం వచ్చింది. ఈ రిజిస్త్రార్‌ కార్యాలయం పరిధిలో నిజామాబాద్‌లోనే ఎక్కువ ఆదాయం వస్తుంది.


తగ్గనున్న పనిభారం

రాష్ట్ర ప్రభుత్వం రెవె న్యూ సంస్కరణలు చేపట్టి నందున సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయాల్లో పనిభారం త గ్గనున్నట్లు తెలుస్తోంది. ఉ మ్మడి జిల్లా పరిధిలోని అన్ని తహసీల్దారు కార్యాలయాలు రిజి స్ట్రేషన్‌ కార్యాలయాలుగా మారనున్నాయి. భూప్రక్షాళన సమయంలోనే కొన్ని కార్యాలయా లను ఏర్పాటు చేశారు. జిల్లాలో బాల్కొండ తహసీల్దా ర్‌ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇక అన్ని కార్యాలయాలలో వ్యవసాయ భూములను రిజిస్ట్రే షన్‌ చేయనున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్లా ట్లు, ఇతర రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ప్రభుత్వం ప్రక టించే కొత్త రెవెన్యూ విధానం బట్టి తెలుస్తోందని అధి కారులు భావిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ప్రభావంరాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌, రెవెన్యూ సంస్కరణలు రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూప నున్నాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ఇటీవల విడుదల చేసిన జీవో వారి ఆదాయానికి గండి కొట్టింది.


అనధికార లేఅవుట్‌ ఉన్న ప్లాట్లను రిజిస్టేషన్‌లు చేయ వద్దని ఉత్తర్వులు ఇవ్వడంతో ఖంగుతిన్నారు. ఆ తర్వా త వారం రోజులకే తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ కూడా వారిపై భారం మోపింది. ఏదో విధంగా భూములను అమ్మకాలు చేద్దామన్న వారికి ప్రస్తుతం తీసుకువస్తు న్న రెవెన్యూ చట్టం అమ్మకాలపై ప్రభావం చూపుతుం దని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అమ్మిన భూముల ను రిజిస్ట్రేషన్‌ చేద్దామని భావించిన వారికి కార్యాల యాలు మూత పడడంతో ఏమి చేయని పరిస్థితి ఏర్ప డింది. ఇదే విధంగా ఉంటే తాము భారీగా నష్ట పోతా మని రియల్‌ వ్యాపారులు భావిస్తున్నారు. నుడా, గ్రా మాల పరిధిలో నాలా కన్వర్షన్‌ లేకుండా ప్లాట్లు చేసిన వారికి మాత్రం జరుగుతుందని నగరానికి చెందిన రి యల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తెలిపారు.


అన్ని కార్యాలయాలూ మూసివేశాం : స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ మధుసూదన్‌రెడ్డి 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను మూసివేశామని స్టాంప్స్‌, రిజిస్ర్టేషన్స్‌ డీఐజీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కేవలం వివాహాలు, వీలునామా రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో జరుగు తున్నాయని ఆయన  తెలిపారు. స్టాంప్‌ పేపర్ల అమ్మకా లను కూడా నిలిపివేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-09-09T10:57:38+05:30 IST