బాధితులను పరామర్శిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
మంత్రి బాలినేని ఆదేశం
ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు 26 : వర్షాల కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గు రువారం సాయంత్రం ఒంగోలు నగరం నెహ్రుకాలనీలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. నగరం లో ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిల్లో 650 మంది ఉన్నారని అధికారులు మంత్రి దృ ష్టికి తెచ్చారు. దీనిపై బాలినేని మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో మంచి భోజనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి వీఎస్.సుబ్బారావు, నగర కమిషనర్ భాగ్యలక్ష్మి, ఎంఈ సుందరరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, వైసీపీ నగర అధ్యక్షుడు వెంకట్రావు పాల్గొన్నారు.