మహానాడుకు పటిష్ట భద్రత

ABN , First Publish Date - 2022-05-27T06:30:09+05:30 IST

తెలుగుదేశం పార్టీ ఆఽధ్వరంలో జరిగే మహానాడుకు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రజా రవాణాకు ఎలాంటి ఆటకం కలగకుండా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా ఆంక్షలు విధించారు. శుక్ర,శనివారాల్లో జరిగే మహానాడుకు ఒంగోలుతో పాటుగా మండవవారిపాలెం ప్రాంతాలను మూడు సెక్టార్లుగా విభజించి పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

మహానాడుకు పటిష్ట భద్రత
ప్రాంగణంలో డాగ్‌ స్వ్కాడ్‌తో తనిఖీలు

 అదనపు ఎస్పీ నేతృత్వంలో 925 మంది పోలీసులు

 తనిఖీలు నిర్వహిస్తున్న డాగ్‌ స్వ్కాడ్‌ బృందాలు

 ఒంగోలులో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఒంగోలు(క్రైం), మే 26 : తెలుగుదేశం పార్టీ ఆఽధ్వరంలో జరిగే మహానాడుకు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రజా రవాణాకు ఎలాంటి ఆటకం కలగకుండా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా ఆంక్షలు విధించారు. శుక్ర,శనివారాల్లో జరిగే మహానాడుకు ఒంగోలుతో పాటుగా మండవవారిపాలెం ప్రాంతాలను మూడు సెక్టార్లుగా విభజించి పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకుగాను 925 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో ఐదుగురు డీఎస్పీలు, 19 మంది ఇన్‌స్పెక్టర్లు,70 మంది ఎస్సైలు, ఎఎస్సైలు,హెడ్‌కానిస్టేబుళ్లు 203,కానిస్టేబుళ్లు 343, మహిళ కానిస్టేబుళ్లు 37 మంది, హోంగార్డులు 139 మంది, ఏఎన్‌ఎ్‌స 95, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 14 మందిని వినియోగిస్తున్నారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి ,తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాలను డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌డిస్పోజబుల్‌ బృందాలు ముందస్తుగా తనిఖీలు చేపట్టాయి. మహానాడు జరిగే ప్రాంతంతో పాటుగా పొలిట్‌ బ్యూర్యో సమావేశం జరిగే సరోవర్‌ హోటల్‌ , చంద్రబాబునాయుడు బసచేసే  ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంను సునిశితంగా తనిఖీలు చేస్తున్నారు.

ఒంగోలులో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఈ నెల 26,27 తేదీలలో ఒంగోలులో జరగనున్న మహానాడు కార్యక్రమం దృష్ట్యా నగరంతో పాటు పరిసరప్రాంతాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉన్నట్లు ఎస్పీ మలికగర్గ్‌ గురువారం తెలిపారు. వాహనాలరాకపోకలు, ప్రజారవాణా దృష్ట్యా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

  గుంటూరు ,చీరాల వైపు నుంచి మహానాడుకు వెళ్లే వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్‌ ఎక్కకుండా సర్వీస్‌ రోడ్డులోకి ఎంటర్‌ అయి కిమ్స్‌ ఆసుపత్రి అండర్‌  పాస్‌ ద్వారా విష్ణుప్రియ కళ్యాణమండపం మీదుగా పార్కింగ్‌ ఏరియాలోకి ఎంటరయ్యి మీటింగ్‌ ప్రాంతానికి వెళ్లాలి. 

  నెల్లూరు వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు పెల్లూరు ఫ్లైవోవర్‌  మీదుగా కిమ్స్‌ ఆసుపత్రివద్ద ఉన్న సర్వీస్‌ రోడ్డులో నుంచి అండర్‌ పాస్‌ గుండా విష్ణుప్రియ కల్యాణ మండపం మీదుగా పార్కింగ్‌ ఏరియాకు వెళ్ళాలి.

 చీమకుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలు కర్నూల్‌ రోడ్డు బైపాస్‌ మీదుగా సర్వీస్‌ రోడ్డు ద్వారా పార్కింగ్‌ ఏరియాకు వెళ్ళాలి.

  కొత్తపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లైఓవర్‌ మీదుగా కిమ్స్‌ అండర్‌ పాస్‌ నుంచి విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదుగా పార్కింగ్‌ ఏరియాకు వెళ్ళాలి.

 గుంటూరు,చీరాల వైపునుంచి ఒంగోలులోకి వెళ్లే వాహనదారులు కిమ్స్‌ ప్లైఓవర్‌, కొప్పోలు రోడ్డు ప్లైఓవర్‌ నుంచి కొత్తపట్నం బస్టాండ్‌ మీదుగా నగరంలోకి వెళ్లాలి.

మహానాడు నుంచి బయటకు వెళ్లే వాహన మార్గాలు

  మహానాడు నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలు జాతీయ రహదారి ఎడమ వైపు నుంచి రోడ్డులోకి వచ్చి త్రోవగుంట వైపు వెళ్లాలి. చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట అండర్‌ పాస్‌ నుంచి వెళ్లాలి.

  నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు పార్కింగ్‌ స్థలం నుంచి  త్రోవగుంట ప్లైఓవర్‌  అండర్‌పాస్‌ నుంచి యూటర్న్‌ తీసుకొని నెల్లూరు వైపు వెళ్లాలి.

  కడప,కర్నూలు వెళ్లే వాహనాలు త్రోవగుంట ప్లైఓవర్‌ అండర్‌పాస్‌ నుంచి కిమ్స్‌ ప్లైఓవర్‌ ఎక్కి పెల్లూరు దగ్గర యూటర్న్‌ తీసుకొని మినీ బైపాస్‌ మీదుగా కర్నూల్‌ రోడ్డులోకి వచ్చి వెళ్ళాలి.

 ఒంగోలు నగరంలో నుంచి గుంటూరు,విజయవాడ వెళ్లే వాహనాలు కొత్తపట్నం బస్టాండ్‌ నుంచి కొప్పోలు ఫ్లైఓవర్‌ వద్ద జాతీయ రహదారికి వెళ్ళాలి.

  నెల్లూరు వైపు వెళ్లే వారు సంఘమిత్ర ఆసుపత్రి వద్ద నుంచి జాతీయరహదారి నుంచి వెళ్లాలి.

  ఒంగోలు నుంచి చీరాల వెళ్లే వాహనాలు కొత్తపట్నం బస్టాండ్‌,కొప్పోలు బైపాస్‌ నుంచి కల్వరీ టెంపుల్‌ మీదుగా త్రోవగుంట ప్లైఓవర్‌ అండర్‌ పాస్‌ నుంచి సర్వీస్‌ రోడ్డు గుండా చీరాల వైపు వెళ్లాలి.

 

Updated Date - 2022-05-27T06:30:09+05:30 IST