అంగవైకల్యం వల్ల ఉద్యోగం ఇవ్వమన్నారు.. ఇప్పుడు తానే ఒక కంపెనీకి అధినేత అయ్యాడు

ABN , First Publish Date - 2022-05-10T18:33:54+05:30 IST

పుట్టుకతోనే మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న నైద్రోవెన్‌పై తల్లిదండ్రులు కొంతకాలానికి ఆశ వదిలేసుకుని ఇక అంగవైకల్యంతోనే ఉంటాడని అనుకున్నారు. నైద్రోవెన్ కూడా ఒకానొక సమయంలో తాను ఇక వీల్‌చైర్‌కే పరిమితం అనకున్నాడు. కానీ, అతనిలో ఆశయం, తపన వీల్‌చైర్ నుంచి మరో స్థానానికి తీసుకెళ్లింది. సంకల్పంతో ఉంటే ఏ అంగవైకల్యం అడ్డురాదని నిరూపించాడు. మోడర్న్ ఇండియా హీరోల్లో ఒకడిగా కీర్తించబడుతున్నాడు..

అంగవైకల్యం వల్ల ఉద్యోగం ఇవ్వమన్నారు.. ఇప్పుడు తానే ఒక కంపెనీకి అధినేత అయ్యాడు

ఇంటర్నెట్ డెస్క్: అతడికి అంగవైకల్యం ఉందని ఉద్యోగం ఇవ్వమన్నారు. అలాంటిది ఇప్పుడతను ఒక కంపెనీకి అధినేత అయ్యాడు. తన ఆవిష్కరణతో తనలాంటి ఎంతో మంది అంగవైకల్యం ఉన్నవారి జీవితాల్లో మార్పులు తెచ్చాడు. మరిన్ని మార్పులు తెచ్చేందుకు కష్టపడతానని చెప్తున్నాడు. నప్పిన్నై కంపెనీ స్థాపకుడు నైద్రోవెన్ అనే వ్యక్తి జీవిత కథ ఇది. పుట్టుకతోనే మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న నైద్రోవెన్‌పై తల్లిదండ్రులు కొంతకాలానికి ఆశ వదిలేసుకుని ఇక అంగవైకల్యంతోనే ఉంటాడని అనుకున్నారు. నైద్రోవెన్ కూడా ఒకానొక సమయంలో తాను ఇక వీల్‌చైర్‌కే పరిమితం అనకున్నాడు. కానీ, అతనిలో ఆశయం, తపన వీల్‌చైర్ నుంచి మరో స్థానానికి తీసుకెళ్లింది. సంకల్పంతో ఉంటే ఏ అంగవైకల్యం అడ్డురాదని నిరూపించాడు. మోడర్న్ ఇండియా హీరోల్లో ఒకడిగా కీర్తించబడుతున్నాడు.


తన అంగవైకల్యం వల్ల ఇతరులపై ఆధారపడటం నైద్రోవెన్‌కు ఇష్టం లేదు. ఇదే అతని స్టార్టప్‌కు తొలి అడుగైంది. తిరగేస్తే అంగవైకల్యం ఉన్నవారి కోసం అత్యుత్తమ ఈ-స్కూటర్లు తయారు చేసి తనలాంటి వారు ఎదుర్కొనే కష్టాల్ని తగ్గిస్తున్నారు. పైగా ఇతను తయారు చేసే స్కూటర్లు పూర్తిగా పర్యావరణహితమైనవి కావడం మరో విశేషం. తక్కువ ఖర్చులో తక్కువ సదుపాయాలతో స్కూటర్లు తయారు చేస్తున్నారు నైద్రోవెన్. ఇది ఎంతో మంది జీవితాల్లో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని అతడు అనుకుని ఉంటే ఆ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు లక్షల మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.


నాన్న ఆటోమొబైల్ ఇంజనీర్ కావడంతో అతడు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అతడి అంగవైకల్యం కారణంగా ల్యాబ్‌లో ఎక్కువ సమయం నిల్చోలేడని, అందువల్ల అతడు కామర్స్ ఎంచుకోవడం ఉత్తమమని టీచర్లు సలహా ఇచ్చారు. తన 26వ ఏటా ఎంబీయే చేస్తుండగా తన ఆరోగ్యం మరింత దెబ్బతిని అంతకు ముందులా నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడికి సర్జరీ తప్ప వేరే ఏ మార్గం లేదు. కానీ సర్జరీ కూడా ఫలిస్తుందో లేదో అని గ్యారెంటీగా చెప్పలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఒకవేళ సర్జరీ విఫలమైతే అతని పరిస్థితి మరింత దిగజారిపోయేది. కానీ శస్త్రచికిత్స చేయించుకోకూడదని అతడు నిర్ణయించుకున్నాడు.


ఆ తర్వాత అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతడి అంగవైకల్యం కారణంగా ఎవరూ అతడిని ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఎంతటి పరిస్థితి వచ్చినా అతడి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇలా ప్రయత్నాలు కొనసాగుతున్న క్రమంలో అతడి తండ్రి అతడి కోసం ఒక కంపాక్ట్ స్కూటర్‌ను అభివృద్ధి చేశఆడు. దాని ద్వారా అతడు ఎటువంటి మద్దతు లేకుండా స్వేచ్ఛగా కదలవచ్చు. ఆ క్షణంలోనే అతడికి స్టార్టప్ ఆలోచన వచ్చింది. సహజంగా నడవలేని వారి కోసం స్కూటర్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్లు వివిధ కంపెనీల్లో ఫ్రీలాన్సర్‌గా పని చేసి జర్మన్ కంపెనీలో చేరాలని అనుకున్నాడు. కానీ వాళ్లు కూడా రిజెక్ట్ చేయడంతో తాన స్టార్టప్ కోసం తానే పని చేయడం ప్రారంభించాడు.


నైద్రోవెన్‌కు ప్రభుత్వం, కుటుంబం, స్నేహితుల నుంచి ఆర్థిక, నైతిక మద్దతు లభించింది. నిధుల సమీకరణలో ప్రైంమినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జెనరేషన్ స్కీమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కీలక పాత్ర పోషించింది. దీనితో పాటు తమిళనాడు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించగా కుటుంబ, స్నేహితులు 11 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఇలాంటి మద్దతు నడుమ 2016లో నప్పిన్నై పేరుతో తన కొత్త స్టార్టప్‌ను నైద్రోవెన్ ప్రారంభించాడు. వికలాంగులు తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి మంచి ఉద్యోగం తపిస్తుంటారని అయితే తనకు అలాంటి వాటిపై నమ్మకం లేదని నైద్రోవెన్ అన్నాడు. ‘‘మీ ఆలోచనపై విశ్వాసం, ఆసక్తి ఉంటే మిమ్మల్ని ఆపగలిగే వైకల్యం లేదని ప్రపంచానికి నిరూపించడానికే ఈ స్టార్టప్ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని అన్నాడు.

Read more