‘చలో ఢిల్లీ..మాదిగల లొల్లి’ కరపత్రాల విడుదల

ABN , First Publish Date - 2021-12-06T03:51:35+05:30 IST

ఈనెల 13న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమ కరపత్రాలను మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం కాగజ్‌నగర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాట్లాడుతూ 28సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం లేదన్నారు. దీంతో మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

‘చలో ఢిల్లీ..మాదిగల లొల్లి’ కరపత్రాల విడుదల
కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 5: ఈనెల 13న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమ కరపత్రాలను మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం కాగజ్‌నగర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాట్లాడుతూ 28సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం లేదన్నారు. దీంతో మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మాదిగ రిజర్వేషన్‌ అమలు కోరుతూ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని కోరుతూ ‘చలో ఢిల్లీ మాదిగల లొల్లి’ పేరిట నిర్వహించే కార్యక్రమంలో పెద్దఎత్తున ఎమ్మార్పీ ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి బొమ్మెన ధర్మయ్య, నాయకులు ఇగురపు నాగేష్‌, మంతెన సతీష్‌, సంతోష్‌, లక్ష్మణ్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T03:51:35+05:30 IST