నిజాంసాగర్‌ ప్రాజెక్టులో రొయ్య పిల్లల విడుదల

ABN , First Publish Date - 2021-01-25T05:39:29+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఆదివారం మత్స్య కార్మికుల ఉద్ధరణ కోసం ఆదివారం వంద శాతం రాయితీపై రొయ్య పిల్లలను విడుదల చేశారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో రొయ్య పిల్లల విడుదల
ప్రాజెక్టులో రొయ్య పిల్లలను విడుదల చేస్తున్న దృశ్యం

నిజాంసాగర్‌, జనవరి 24: నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఆదివారం మత్స్య కార్మికుల ఉద్ధరణ కోసం ఆదివారం వంద శాతం రాయితీపై రొయ్య పిల్లలను విడుదల చేశారు. ఆదివారం ప్రాజెక్టులో రెండో విడత 6లక్షల 65వేల చేప పిల్లలకు గాను కేవలం 94వేల 240చేప పిల్లలను విడుదల చేశారు. రెండు విడతలుగా చేప పిల్లలను విడుదల చేయడంలో మత్స్య శాఖ అధికార యంత్రాంగం రొయ్య పిల్లలను సప్లయ్‌ చేసే ఏజన్సీతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినబడుతున్నాయి. నిజాంసాగర్‌లో 6లక్షల 62వేల రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు శంకర్‌ రాథోడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయ జిల్లాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సాయిబాబా, మత్స్యకార్మిక నాయకులు బోయి రాములు, మైశయ్య, జిల్లా అధికారి మదన్‌మోహన్‌, ఎఫ్‌డీవో డోల్‌సింగ్‌, తదిత రులున్నారు. 

Updated Date - 2021-01-25T05:39:29+05:30 IST